Hair Growth: ఈ 5 పోషకాలు తీసుకుంటే... జన్మలో జుట్టు రాలదు
Hair Growth: జుట్టు రాలుతుందంటే షాంపూ, ఆయిల్ మార్చడమే పరిష్కారం కాదు. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంతకన్నా ముందు శరీరంలో ఏ పోషకాలు తగ్గాయో తెలుసుకోవాలి. హెయిర్ హెల్త్ ని ప్రభావితం చేసే 5 అంశాలపై ఓ లుక్కేయండి.

జుట్టు రాలడానికి కారణమయ్యే 5 అంశాలు ఇవే..
జుట్టు శరీరంపైన ఉంటుంది కాబట్టి అది బయట సమస్య అనుకుంటే పొరపాటు. శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం, హార్మోన్లలో మార్పులు రావడం వంటి కారణాలు కూడా జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే 5 అంశాలు
1. జింక్
శరీరంలో కణాల పెరుగుదల, కణజాల మరమ్మతులో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, జుట్టు పెరుగుదలకు కూడా ఇది అవసరం. శరీరంలో జింక్ లోపిస్తే జుట్టు రాలే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శరీరానికి అవసరమైన మోతాదులో ఈ పోషకం అందేలా చూసుకోవాలి.
2. విటమిన్ డి
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారిలో విటమిన్ డి స్థాయులను కూడా పరిశీలించాల్సి రావచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల జుట్టు రాలే సమస్యలకు, శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉండటానికి సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సమతుల ఆహారం, తగినంత సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పొందవచ్చు. అవసరమైతే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలి.
అసలు కారణాన్ని తెలుసుకోవాలి
3. ఫెరిటిన్ (శరీరంలో ఐరన్ నిల్వలు)
శరీరంలో ఐరన్ నిల్వలను అంచనా వేయడానికి ఫెరిటిన్ స్థాయులను పరిశీలిస్తారు. ఈ నిల్వలు తక్కువగా ఉంటే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారిలో ఈ సమస్య కనిపించవచ్చు. అయితే జుట్టు రాలడానికి ఐరన్ లోపమే కారణమని నిర్ధారించలేం. అవసరమైన పరీక్షల ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవాలి.
4. విటమిన్ బి12
విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీకి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. ఈ విటమిన్ లోపిస్తే రక్తహీనత సహా ఇంకా ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొంతమందిలో జుట్టు సంబంధిత సమస్యలతోనూ దీనికి సంబంధం ఉండవచ్చు. అందువల్ల జుట్టు రాలడం నిరంతరంగా కొనసాగితే శరీరంలో బి12 స్థాయులను పరీక్షించాల్సిన అవసరం ఉందేమో వైద్యులను సంప్రదించాలి.
5. థైరాయిడ్
శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నా జుట్టు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల కొంతమందిలో జుట్టు పలుచబడటం, ఎక్కువగా రాలడం వంటి సమస్యలు కనిపించవచ్చు. జుట్టు రాలడంతోపాటు అలసట, బరువులో మార్పులు, చలిని లేదా వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
జుట్టు రాలితే ఏం చేయాలి?
జుట్టు రాలుతున్నప్పుడు వెంటనే సప్లిమెంట్లు వాడటం లేదా ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులు కొనడం సరైన పరిష్కారం కాకపోవచ్చు. పోషకాల లోపాలు, థైరాయిడ్ సమస్యలు మాత్రమే కాకుండా వంశపారంపర్య కారణాలు, ఒత్తిడి, అనారోగ్యం, హార్మోన్ల మార్పులు వంటి అంశాలు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. అందుకే సమస్య ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. లోపం ఉన్నట్లు తేలితే దానికి తగిన చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా ఐరన్, విటమిన్ డి లేదా ఇతర సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోకూడదు.

