తేనె ఆరోగ్యానికే కాదు.. జుట్టు అందానికి కూడా.. ఎలా ఉపయోగించాలంటే..
తేనె యాంటీ యాక్సిడెంట్లకు మంచి మూలం. ఇది చర్మ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి, దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు చుండ్రును తగిస్తాయి.

honey
తేనె యాంటీఆక్సిడెంట్లకు సహజ వనరు. అంతేకాదు దీనిలో యాంటీ బయోటిక్, విటమిన్ బి6, యాంటీ సెప్టిక్, విటమిన్ బి1 లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ తేనె తింటే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, కఫం సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు ఇవి కంటి చూపును మెరుగుపరుస్తుంది కూడా.
honey
ఇది వృద్ధాప్యం ప్రభావాలను ఆలస్యం చేయడానికి, దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేయడానికి కూడా సహాయపడుతుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు.. జుట్టు అందానికి కూడా మేలు చేస్తాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
ఇది మచ్చలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేనెతో కూడిన హెయిర్ మాస్క్ ను అప్లై చేయడం వల్ల తలపై ఉన్న చుండ్రు మొత్తం పోతుంది. అలాగే నెత్తిమీద దురద తగ్గిపోతుంది. అందుకోసం.. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో మూడు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. దీన్ని జుట్టుకు బాగా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. వినెగర్ చర్మం సహజ పిహెచ్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తేనె శుభ్రపరిచేదిగా పనిచేస్తుంది.
అలాగే రెండు పండిన అరటిపండ్లును, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అరకప్పు తేనె తీసుకోండి. మెత్తగా దీన్ని గ్రైడ్ చేసి... నెత్తిమీద, జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి. వడదెబ్బకు గురైన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం అర టేబుల్ స్పూన్ తేనె, అలోవెరా జెల్, రోజ్ వాటర్ ను బాగా కలపండి. దీన్ని వడదెబ్బ తగిలిన ప్లేస్ లో అప్లై చేయండి.
hair care
చలికాలంలో చాలా మందికి చర్మం పొడిబారుతుంది. అయితే మీ చర్మాన్ని తేమ చేయడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం.. పెరుగు, తేనెను ఉపయోగించండి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ తేనె తీసుకుని బాగా కలపాలి. దీన్ని చర్మానికి సమానంగా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి.