MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ ఆకులోని వాటర్ ఫేస్ వాష్ లా పనిచేస్తుంది.. చర్మ సమస్యలు కూడా పోతాయి..

ఈ ఆకులోని వాటర్ ఫేస్ వాష్ లా పనిచేస్తుంది.. చర్మ సమస్యలు కూడా పోతాయి..

రకరకాల కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే నేచురల్ పద్దతులే చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ముఖానికి సంబంధించిన ఎన్నో సమస్యలను తొలగిస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పేలవమైన జీవన శైలి, వాతావరణ కాలుష్యం చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. వీటివల్ల ముఖం అందం మొత్తం తగ్గిపోతుంది. ముఖ చర్మం ముడతలు పడటం, దుమ్మూ దూళి పేరుకుపోవడం, నిర్జీవంగా మారడం, మచ్చలు వంటి సమస్యలు వస్తాయి. సూర్యరశ్మి, ధూళి కారణంగా కొంతమందికి ఏకంగా మొటిమలు కూడా అవుతుంటాయి. ఇలాంటి సమస్యలను పోగొట్టుకోవడానికి కెమికల్స్ తో మిక్స్ చేసిన ఉత్పత్తులను ముఖానికి వాడితే ఈ సమస్యలు పోయి లేనిపోని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చర్మ సమస్యల నుంచి బయటపడటానికి నేచురల్ పద్దతులను వాడటమే మంచిది. అయితే ఒక చెట్టు ఆకు కూడా నేచురల్ ఫేష్ వాష్ లా పనిచేస్తుంది. ఇది ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నేచురల్ ఫేస్ వాష్

జామ ఆకులు నేచురల్ ఫేస్ వాష్ లా పనిచేస్తుంది. ఈ ఆకులు మన చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయని రుజువైంది కూడా. వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో చర్మ సమస్యలను దూరం చేస్తాయి. జామ ఆకుల్లో ప్రోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జామ ఆకుల్లో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

37

ఎలా తయారుచేయాలంటే..? 

ముందుగా కొన్ని జామ ఆకులను తీసుకుని నీట్ గా కడిగి కొన్ని నీటిలో వేసి బాగా మరిగించండి. దీనివల్ల ఆకుల్లోని పోషకాలన్నీ నీటిలో కలిసిపోతాయి. ఈ నీటిని వడకట్టి ఫేస్ వాష్ గా ఉయోగించండి. 
 

47

జామ నీటి ప్రయోజనాలు

జామ ఆకుల వాటర్  మృతకణాలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ వాటర్ తో ముఖం కడుక్కోవడం వల్ల మురికిగా ఉండే చర్మం పొర తొలగిపోయి.. ముఖం అందంగా మెరిసిపోతుంది. 
 

57

ఈ వాటర్ యాంటీ ఏజింగ్ లా కూడా పనిచేస్తుంది. ఈ వాటర్ ముఖంపై ఉండే ముడతలను కూడా పోగొడుతుంది. ఈ వాటర్ తో రోజూ ముఖం కడుక్కుంటే చర్మం బిగుతుగా కనిపిస్తుంది.  దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ముడతలు అసలే కనిపించవు. 

67

జామ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆయిలీ స్కిన్ సమస్యను తొలగిస్తాయి. ఎందుకంటే ఈ నీటిలో ముఖంపై ఉండే నూనెను నియింత్రించే గుణాలు ఉంటాయి. దీంతో మొటిమలు, మచ్చలు కూడా పోతాయి. ఈ వాటర్ జిడ్డు చర్మానికి ప్రయోజకరంగా ఉంటుందని నిరూపించబడింది కూడా. 

77

జామ నీటికి ముఖంపై ఉండే మొండి మచ్చలను తొలగించే సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ నీటిని ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ నీటిని ఉపయోగించడం వల్ల చర్మ చికాకు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇది సోరియాసిస్ సమస్యను కూడా పోగొడుతుంది. 

 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Goa Food: గోవా వెళ్తే ఈ రెస్టారెంట్లలో తినకుండా రాకండి.. అంత టేస్టీ, పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ
Recommended image2
Coconut: కొబ్బ‌రికాయ‌లోకి నీరు ఎలా వ‌స్తుంది.? అంత తియ్య‌గా ఎందుకుంటాయి
Recommended image3
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved