- Home
- Life
- Rose Plant: ఈ విత్తనాలు వేస్తే గులాబీ మొక్కకు నిండుగా పూలు పూస్తాయి..ఏపుగా పెరుగుతుంది కూడా
Rose Plant: ఈ విత్తనాలు వేస్తే గులాబీ మొక్కకు నిండుగా పూలు పూస్తాయి..ఏపుగా పెరుగుతుంది కూడా
Rose Plant: సిటీల్లోగార్డెనింగ్ క్రేజ్ బాగా పెరిగింది. గులాబీ మొక్కలు పెంచినా పూలు పూయకపోతే బాధగా ఉంటుంది. అయితే ఈ ట్రిక్ ట్రై చేయండి. మొక్క నిండా గులాబీలు పూస్తాయి. మొక్క ఏపుగా పెరుగుతుంది కూడా. పురుగులు పట్టనే పట్టవు.
15

Image Credit : Gemini AI Generated
గార్డెనింగ్ ఐడియా
సిటీల్లో ఇప్పుడు గార్డెనింగ్ ఒక మంచి హాబీగా మారింది. ఇంటి ఆవరణ లేదా బాల్కనీ అందాన్ని పెంచడానికి రంగురంగుల పూల మొక్కలు పెంచుతుంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కలు ఉన్నా పూలు పూయవు. ముఖ్యంగా గులాబీ మొక్కకు పూలు లేకపోతే చాలా బాధగా ఉంటుంది.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : Gemini AI Generated
పూల కోసం సూపర్ ట్రిక్స్
గులాబీ మొక్క నిండా పూలు పూయడానికి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మీ మొక్క నిండా గులాబీలు వికసిస్తాయి. దీంతో మీ ఇంటి ఆవరణ, బాల్కనీ లేదా టెర్రస్ చాలా అందంగా కనిపిస్తుంది.
35
Image Credit : Gemini AI Generated
ఉల్లిపాయ విత్తనాలు
మొక్క నిండా గులాబీలు పూయాలంటే, దాని మొదట్లో ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు పెంచాలి. మార్కెట్లో ఉల్లి విత్తనాలు దొరుకుతాయి. గులాబీ మొక్క మొదట్లో ఉల్లి విత్తనాలు చల్లి, మట్టితో కప్పి, నీళ్లు చల్లాలి. ఉల్లి మొలకలు పెరిగే కొద్దీ, గులాబీ మొక్క పూలతో నిండిపోతుంది.
45
Image Credit : Gemini AI Generated
ఉల్లిపాయే ఎందుకు?
ఉల్లిపాయలో ఉండే పొటాషియం గులాబీ మొక్కకు ఎక్కువ పూలు పూయడానికి సాయపడుతుంది. పొటాషియం గులాబీ మొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉల్లిలోని ఫాస్పరస్ మొక్క వేర్లు బలంగా పెరగడానికి, విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిలో కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.
55
Image Credit : Gemini AI Generated
మట్టి ఆరోగ్యాన్ని కాపాడే ఉల్లి
ఉల్లిపాయలో ఉండే ఫాస్పరస్ సహజ కీటకనాశినిగా, ఫంగిసైడ్గా పనిచేస్తుంది. కాబట్టి గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉల్లిపాయ బాగా సాయపడుతుంది. మీకు ఉల్లి విత్తనాలు దొరకకపోతే, ఇంట్లో ఉండే ఉల్లిపాయలనే మట్టిలో నాటవచ్చు లేదా మట్టిలో పాతిపెట్టవచ్చు.
Latest Videos





