చలికాలంలో గోల్డెన్ మిల్క్ ను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
చాలా మంది చలికాలం వచ్చిందంటే చాలు గోరు వెచ్చని గోల్డెన్ మిల్క్ ను తప్పనిసరిగా తాగుతుంటారు. ముఖ్యంగా పిల్లలకు కూడా తాగిస్తుంటారు. ఎందుకంటే ఈ పసుపు పాలు ఎన్నో అంటువ్యాధులను, దగ్గు, జలుబు, జ్వరాల నుంచి రక్షిస్తుందని..

చలి రోజు రోజుకు పెరిగిపోతోంది. చలితీవ్రత పెరిగే కొద్దీ చాలా మంది అనేక జబ్బుల బారిన పడుతుంటారు. చలికాలంలో పసుపు పాలను తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే చలికాలంలో పిల్లలు, పెద్దలు పసుపు పాలను పక్కాగా తాగుతుంటారు. నిజానికి చలికాలంలో పసుపు పాలను తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇతర అనారోగ్య సమస్యలను కలిగించే శీతాకాలపు వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడటానికి మన శరీరానికి శక్తి అందుతుంది. ఈ పాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గోల్డెన్ మిల్క్ వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
హల్దీ దూద్ పాలు లేదా గోల్డెన్ మిల్క్ ను తయారుచేయడానికి.. గ్లాస్ గోరువెచ్చని పాలను తీసుకుని అందులో చిటికెడు పసుపును కలిపితే సరి. అయితే ఈ రుచి అందరికీ నచ్చకపోవచ్చు. ఇలాంటి వారు ఈ పాలకు మరికొన్నింటిని చేర్చి టేస్టీగా తయారుచేయొచ్చు. చూర్ణం చేసిన యాలకుల గింజలు, లవంగాల ముక్కలు, మిరియాల పొడిని ఈ పసుపు పాలలో కలిపి తాగొచ్చు.
గోల్డెన్ మిల్క్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పసుపు పాలలో కర్కుమిన్ కూడా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ పానీయం చర్మ సమస్యలను పోగొడుతుంది. స్కిన్ అందంగా మెరిపోవడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకలను బలంగా చేస్తుంది.
గోల్డెన్ మిల్క్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ పానీయాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. దీన్ని ఇంట్లోనే తయారుచేసుకుని తాగాలి. బయట కొని అసలే తాగకూడదు. ఎందుకంటే వాటిలో ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలను కలిపే అవకాశం ఉంది.
పసుపు పాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఎన్నో పరిశోధన అధ్యయనాలు.. ఈ కర్కుమిన్ మెదడుకు ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొన్నాయి. కర్కుమిన్ మెదడు ఉత్పన్న న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ తో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది దాని స్థాయిలను పెంచుతుంది. మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కూడా.
పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళననం మూడ్ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. పలు పరిశోధనల ప్రకారం.. కర్కుమిన్ యాంటీ డిప్రెసెంట్స్ లాగే అదే ప్రభావాన్ని కలిగి ఉన్నట్టు కనుగొన్నారు.
గోల్డెన్ పాలను ఎప్పుడు తాగాలి?
నిద్రపోయే ముందు గోరువెచ్చని పసుపు పాలను తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ సమయంలో తాగడం వల్ల పిల్లలు, పెద్దలు ప్రశాంతంగా నిద్రపోతారు. మీకు పాలు నచ్చకపోతే మజ్జిగతో కూడా తీసుకోవచ్చు. దీనివల్ల కూడా ప్రయోజనాలను పొందుతారు.