Termites: ఇదొక్కటి స్ప్రే చేస్తే.. ఇంట్లో చెదపురుగులు మళ్లీ కనిపించవు..!
ఈ చెద పురుగులను చంపడానికి మార్కెట్లో అనేక మందులు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటి ప్రభావం చాలా తక్కువ అని మాత్రమే చెప్పొచ్చు.

ఇంట్లో చెదపురుగులా?
వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇది మనకు హాయి ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ, కొన్ని రకాల సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా..ఈ వర్షకాలంలో చెదపురుగుల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఈ పురుగులు వచ్చాయి అంటే.. మీ ఇంట్లో ఖరీదైన ఫర్నీచర్, తలుపులు, అల్మారాలు, కబోర్డ్స్ మొత్తం అన్నింటినీ నిశ్శబ్దంగా పాడుచేసేస్తాయి.
ఈ చెద పురుగులను చంపడానికి మార్కెట్లో అనేక మందులు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటి ప్రభావం చాలా తక్కువ అని మాత్రమే చెప్పొచ్చు. ఈ మందులు చల్లడం వల్ల కొంతకాలం మాత్రమే ఈ పరుగులు రాకుండా ఆపగలవు. కానీ, వాటి గుడ్లు అక్కడే ఉండిపోతాయి. వాటితో మళ్లీ కొత్త పురుగులు పుట్టుకువస్తాయి. చెదపురుగులకు ఒక రాణి ఉంటుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసి ఉండొచ్చు. ఈ రాణి పురుగు కేవలం ఒకే ఒక్క రోజులో 25వేల గుడ్లు పెడుతుంది. అవన్నీ పురుగులు అయితే.. ఇక వాటిని కంట్రోల్ చేయడం మనవల్ల కాదు అనే చెప్పాలి. లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుక్కున్న ఫర్నీచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే.. వీటిని శాశ్వతంగా తొలగించడం చాలా అవసరం. మరి, ఈ చెదపురుగులు పూర్తిగా నాశనం అవ్వాలంటే ఏం స్ప్రే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
చెదపురుగులను చంపే ఔషధం
కొన్ని వస్తువుల వాసన చెదపురుగులను ఇబ్బంది పెడుతుంది. ఆ వాసనకు అవి మూర్ఛపోతాయి లేదా చనిపోతాయి. ఇంట్లో చెదపురుగులను చంపే మందును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
చెదపురుగుల మందు తయారీకి కావలసినవి
1 కప్పు కిరోసిన్ నూనె
1 కప్పు ఉమ్మెత్త రసం
1 టేబుల్ స్పూన్ వేప నూనె
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1 పాత ఇంజెక్షన్
చెదపురుగుల మందు తయారు చేసే పద్ధతి
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కిరోసిన్ ఉంటుంది. లేకపోతే, మీరు దానిని మార్కెట్‌లో సులభంగా కనుగొనవచ్చు. అయితే, మీరు కిరోసిన్‌కు బదులుగా పెట్రోల్‌ను కూడా ఉపయోగించవచ్చు.వర్షాకాలంలో మీకు ఉమ్మెత్త పువ్వు పుష్కలంగా దొరుకుతుంది. దానిని బాగా రుబ్బి దాని రసాన్ని తీయండి.ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని కిరోసిన్ ఉమ్మెత్త పువ్వు రసం మిశ్రమంలో కలపండి. ఇలా చేసిన తర్వాత, మీరు ఈ మిశ్రమానికి 1 చెంచాడు వేపనూనెను జోడించాలి.ఇప్పుడు పాత ఉపయోగించిన ఇంజెక్షన్ తీసుకోండి. ఈ మిశ్రమాన్ని అందులో నింపండి, ఆపై మీరు చెదపురుగులు ఉన్న ప్రదేశంలో దాన్ని ఉపయోగించవచ్చు.
ఈ చెదపురుగులను చంపే ఇంజెక్షన్‌ను ఎలా ఉపయోగించాలి?
మీ ఇంటి ఏదైనా గోడ, చెక్క తలుపు లేదా చట్రంపై చెదపురుగులు ఉంటే, మీరు ఈ ఇంజెక్షన్‌ను నింపి అక్కడ స్ప్రే చేయవచ్చు.చెదపురుగులు ఉన్న చోట ఈ మందును కొడితే.. చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.ఈ ఇంజెక్షన్‌ను గోడపై ఉన్న పగుళ్లలో కూడా ఉంచండి ఎందుకంటే లోపల ఉన్న చెదపురుగులు చనిపోతాయి. ఆ ప్రదేశంలో మళ్ళీ చెదపురుగులు కనిపించవు. వారానికి ఒకసారి ఈ మందు స్ప్రే చేస్తే.. ఈ చెదపురుగులు పూర్తిగా నాశనం అవుతాయి.
గమనిక: ఈ ఇంట్లో తయారుచేసిన మందు, ఇంజెక్షన్‌ను పిల్లలకు దూరంగా ఉంచాలి. పెద్దలు కూడా దీనిని వాడే ముందు.. చేతులకు గ్లౌజులు వేసుకోవడం మంచిది.