ఈ జ్యూస్ లను తాగితే బెల్లీ ఫ్యాట్ ఎంత తొందరగా తగ్గుతుందో..!
కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, అలాగే నూనెలో వేయించిన ఆహారాలు శరీరంలో కొవ్వును బాగా పెంచుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
belly fat
నేడు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్. పొట్టలో చాలా భాగాల్లో పేరుకుపోయే కొవ్వు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీనివల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. ఇది తరచుగా వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సరైన ఆహారం, రోజువారీ వ్యాయామాలు చాలా అవసరం.
belly fat
కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఎక్కువగా ఉండే ఆహారాలు, అలాగే నూనెలో వేయించిన, ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉండదు. కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్నే వీళ్లు తినాల్సి ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కొన్ని ఫ్రూట్ జ్యూస్ లు బాగా సహాయపడతాయి.
పుచ్చకాయ జ్యూస్
బరువు తగ్గాలనుకునే వారు ఆహారాల్లో చేర్చుకోవలసిన వాటిలో పుచ్చకాయ జ్యూస్ ఒకటి. పుచ్చకాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. భోజనానికి ముందు పుచ్చకాయ తినడం వల్ల మీరు అదనపు కేలరీలను తీసుకునే అవకాశం తగ్గుతుంది. పుచ్చకాయ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకున్న వాళ్లు పుచ్చకాయ జ్యూస్ ను తప్పక తాగండి. ఇది ఆహారాన్ని ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది.
orange juice
ఆరెంజ్ జ్యూస్
నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నారింజ కూడా బెల్లీ ఫ్యాట్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
blue berry juice
బ్లూబెర్రీ జ్యూస్
బెర్రీస్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించడానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బ్లూబెర్రీ జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోండి.
apple juice
ఆపిల్ జ్యూస్
ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో ఆపిల్స్ ను తినడం వల్ల కడుపు తొందరగా నిండిందన్న భావన కలుగుతుంది. ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి. ఇవి మీరు ఎక్కువగా తినకుండా నిరోధిస్తాయి. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారు. పెక్టిన్ ఎక్కువగా ఉండే ఆపిల్ కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. అందుకే ఆపిల్ జ్యూస్ ను తాగండి.
kiwi juice
కివి జ్యూస్
కివిల్లో విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కివి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కివి జ్యూస్ ను రెగ్యులర్ గా కూడా తాగొచ్చు.