మూత్రపిండాల వ్యాధులు రాకూడదంటే వీటిని తప్పకుండా తినండి..
కొన్ని రకాల ఆహారాలు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే వీటిని ప్రతిరోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల పనితీరు తగ్గుదలే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లక్షణం. దీనినే సాధారణంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం అంటారు. మూత్రపిండాలు మన శరీరంలో ఉన్న అదనపు ద్రవాలను మీ రక్తం నుంచి తొలగిస్తాయి. తర్వాత ఇవి మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఒక వేళ మీకు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టైతే మీ శరీరం ఎక్కువ మొత్తంలో ద్రవాలను, ఎలక్ట్రోలైట్ లు, వ్యర్థాలను ఎక్కువగా గ్రహిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం.
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోతే.. వ్యర్థాలు, ముఖ్యంగా ఆహార వ్యర్థాలు రక్తంలో పేరుకుపోతాయి. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ప్రమాదం తగ్గాలంటే ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకుందాం పదండి..
వెల్లుల్లి
వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే శరీర మంటను కూడా తక్కువ చేస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు, వాటిపై క్రిమి కీటకాలు పేరుకుపోకుండా నిరోధించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిని అలాగే పచ్చిగా తినొచ్చు. లేదా వాటర్ లో వేడి చేసి తీసుకోవచ్చు. పొడిని కూడా వాడొచ్చు. వెల్లుల్లిని వంటలో వేస్తే చాలా టేస్టీగా అవుతుంది. వెల్లుల్లి పౌడర్ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలల్లో ఆంథోసైనిన్లు, ఎల్లాగిటానిన్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ స్ట్రాబెర్రీలను చాలా శక్తివంతమైనవి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని ఆపుతాయి. శరీర కణ నిర్మాణాలను కాపాడుతాయి. స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ , ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా.
ఆపిల్స్
ఆపిల్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మలబద్దకాన్ని పోగొడుతాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి కూడా. ముఖ్యంగా క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఆపిల్ పండు మన మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ పండు మూత్రపిండాల వ్యాధి పేషెంట్లకు మెడిసిన్స్ తో సమానం.
క్యాబేజీ
క్యాబేజీలో.. పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యాబేజీల్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే పొటాషియం కూడా కిడ్నీలను రక్షిస్తుంది.
ఉల్లిపాయ
ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఎన్నో రోగాల నుంచి కూడా కాపాడుతుంది. ఉల్లిపాయల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఇది కార్భోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల జీవక్రియకు సహాయపడే ఖనిజం. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది.