MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? వీటిని తినండి వెంటనే ఉపశమనం పొందుతారు

ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? వీటిని తినండి వెంటనే ఉపశమనం పొందుతారు

డార్క్ చాక్లెట్స్ ను తినడం వల్ల స్ట్రెస్, ఆందోళనలు మటుమాయం అవుతాయి. ఈ డార్క్ చాక్లెట్లలో ఎపికాటెచినన్, కాటెచిన్ వంటి ఫ్లేవనాయిల్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి ఎన్నో సమస్యలను పోగొడుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 08 2022, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మానసిక ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది స్ట్రెస్ తో బాధపడుతున్నారు. అయితే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కొన్ని రకాల ఆహారాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఒమేగా -3 కొవ్వులు, కూరగాయలతో సహా పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు వంటి కొన్ని ఆహారాలు కార్టిసాల్ అని పిలువబడే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
STRESS

STRESS

విటమిన్ బి, విటమిన్ సి, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. అనారోగ్యకరమైన ఆహారాలు ఒత్తిడి స్థాయిని విపరీతంగా పెంచుతాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకోకపోతే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

38

డార్క్ చాక్లెట్స్

డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఈ చాక్లెట్స్ లో ఎపికాటెచిన్, కాటెచిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 70% కోకో లేదా అంతకంటే ఎక్కువ (ఎక్కువ పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లను కలిగి ఉన్న) డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు.

48
food for stress

food for stress

కార్భోహైడ్రేట్లు

కార్బోహైడ్రేట్లు తాత్కాలికంగా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది మానసిక స్థితిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలు పెరిగిన తరువాత ఒత్తిడితో  బాధపడుతున్న వారిలో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతుందట. కుకీలు, కేకులు, వైట్ పాస్తా, వైట్ బ్రెడ్ తో సహా తెల్ల పిండితో తయారుచేసే ఆహారాలను ఎక్కువగా తీసుకోకండి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరస్థాయిలను ఆకస్మత్తుగా పెంచడం లేదా తగ్గిస్తాయి. 
 

58

అవకాడో

అవకాడోలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్.. ఈ ఆవశ్యక ఆమ్లాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని పేర్కొంది. అంతేకాదు దీనిలో ఫైటోకెమికల్స్, ఫైబర్స్, అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. జనవరి 2013 లో న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక సర్వేలో.. అవకాడోలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం నియంత్రణలో ఉంటాయట. 
 

68

చేపలు

చేపల్లో ఒత్తిడిని పోగొట్టే ఔషదగుణాలుంటాయి. అంతేకాదు ఈ చేపలు గుండె జబ్బులను నివారించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు నిరాశను తగ్గించడానికి సహాయపడుతాయి. కొవ్వు చేపలలో ట్యూనా, సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ ఉన్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

78
calcium

calcium

కాల్షియం

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అయితే డిసెంబర్ 2012 లో జర్నల్ న్యూట్రిషన్ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ కాల్షియం కూడా నిరాశను తగ్గిస్తుందని వెల్లడించింది. జర్నల్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు కండరాలను సడలించడానికి, మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయని వెల్లడైంది. 

88
nuts

nuts

గింజలు

గింజల్లో కొవ్వు ఆమ్లాలతో పాటుగా విటమిన్ బి తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ విటమిన్ బి ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పిస్తా, బాదం, వాల్ నట్స్ ను తినాలని చెబుతున్నారు. ఇవి రక్తపోటును కూడా తగ్గిస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Washing Machine Hacks: వాషింగ్ మెషీన్ లో ఇవి వేస్తే బట్టలు ముడతలే పడవు
Recommended image2
Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్
Recommended image3
Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved