మొటిమలు, మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇవి తినండి తగ్గిపోతాయి..
మొటిమలు, మొటిమల వల్ల అయ్యే మచ్చలు అంత తొందరగా తగ్గవు. అయితే కొన్ని ఆహారాలు వీటిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

జిడ్డు చర్మం, వాతావరణ కాలుష్యం, ఆయిలీ ఫుడ్స్ వంటి కొన్ని కారణాల వల్ల మొటిమలు విపరీతంగా ఏర్పడుతుంటాయి. మొటిమలే కాదు.. మొటిమల వల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలైతే ఏం చేసినా తగ్గకు. కానీ వీటివల్ల ముఖ అందం మొత్తం తగ్గుతుంది. వీటికి తోడు మొటిమల వల్ల మంట, చికాకు కూడా పెడుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే కూడా మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
papaya
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించినది. అయితే ఈ ఎంజైమ్ ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. మూసుకుపోయిన రంధ్రాలను క్లియర్ చేస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది కూడా. ఈ బొప్పాయి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. బొప్పాయిని తింటే చర్మంపై ముడతలు తగ్గిపోతాయి.
berries
బెర్రీలు: బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, చెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మొండి మచ్చలను తొలగిస్తాయి. మొటిమలు ఎక్కువయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు.. మచ్చలను కూడా సులువుగా తొలగిస్తుంది.
నిమ్మకాయలు: నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. నిమ్మకాయను తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా అవుతుంది. మొటిమలు కూడా తగ్గిపోతాయి. నిమ్మకాయను తొక్కతో సహా తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలను పొందుతారు.
కొవ్వు చేపలు: కొవ్వు చేపలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. కొవ్వు చేపలను తింటే మొండి మచ్చలు ఇట్టే తగ్గిపోతాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలు చర్మానికి మేలు చేస్తాయి.
Turmeric for health
పసుపు: పసుపును చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనిలో కర్కుమిన్ ఎక్కువగా ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమల వల్ల అయ్యే రంధ్రాలను తగ్గిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపు మచ్చలను తొందరగా తగ్గిస్తుంది.
బీట్ రూట్: బీట్ రూట్ లో విటమిన్ ఎ తో పాటుగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మాన్ని విషపూరిత కాలుష్య కారకాల నుంచి రక్షిస్తాయి.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మొటిమలను, మచ్చలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిలో ఒమేగా 3 , ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి కూడా..
చిక్కుళ్లు: బీన్స్, చిక్పీస్, కాయ ధాన్యాలు మొదలైన వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ సూచి తక్కువగా ఉంటుంది. బీన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మొటమలు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వైట్ రైస్, చాక్లెట్, వైట్ తృణధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.