MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • తిన్న వెంటనే ఛాతిలో మంట పుడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే..

తిన్న వెంటనే ఛాతిలో మంట పుడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే..

తిన్నవెంటనే కొంతమందికి ఛాతిలో మంట పుడుతుంది. దీనికి కారణం కడుపులో అధిక ఆమ్లం విడుదలవడం. ఈ సమస్యనే గ్యాస్ట్రిక్ అంటారు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 08 2022, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వారికి తిన్న తర్వాత ఛాతిలో మంట పుట్టడం మొదలవుతుంది. దీనికి కారణం మన కడుపులో ఆమ్లం అధికంగా ఉండటం. అయితే ఈ సమస్య రావడానికి కారణాలు అనేకం. వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఫాస్ట్ ఫాస్ట్ గా ఫుడ్ ను తీసుకోవడం, ఎరేటెడ్ పానియాలను తాగడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. అంతేకాదు తొందరగా అరగని ఫైబర్, స్టార్చ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా మన కడుపులోని మంచి బ్యాక్టీరియా అసమతుల్యత మూలంగా కూడా ఈ సమస్య బారిన పడే అవకాశాలున్నాయి. 
 

27


తిన్నది అరగకపోవడం, వావు, ఆకలిగా అనిపించినా.. కొద్దిగానే తినడం, వాంతులు, వికారం వంటి గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో వచ్చే ఛాతిలో నొప్పిని కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇపుుడు తెలుసుకుందాం.
 

37


పెరుగు: పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఛాతిలో మంటగా అనిపించినప్పుడు కాస్త పెరుగును తీసుకుని దానిలో కొన్ని వాటర్ కలుపుకుని తాగితే ఆ నొప్పి నుంచి ఈజీగా బయటపడతారు. అలాగే ఈ పెరుగు కు జీలకర్ర , నల్ల ఉప్పును కలిపి తీసుకుంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు దీనికి యాపిల్ తో కలిపి తాగినా చక్కటి ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

47

ఫెన్నెల్: గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారికి ఈ ఫెన్నెల్ చక్కగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది తిన్న వెంటనే వీటిని నములుతూ ఉంటారు. ఇవి గ్యాస్ట్రిక్ స్రావాన్ని ఉత్తేజపరిచే సమ్మేళనాలను కలిగుంటాయి. అంతేకాదు అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను ఇవి దూరం చేస్తాయి. 

57

లవంగాలు:  మలబద్దకం, అజీర్తి, వాపు, గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇది దివ్య ఔషదంలా పనిచేస్తుంది. తిన్న తర్వాత లవంగాలను నమిలితే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశమే ఉండదు. అంతేకాదు తిన్న వెంటనే ఒక టీ స్పూన్ లవంగాల పొడిని తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే ఇది మన బాడీలో ఉండే అదనపు గ్యాస్ ను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

67


ఫైబర్: జీర్ణ వ్యవస్థకు అధిక ఫైబర్లు లభించే ఆహారం మేలు చేస్తుంది. ఈ ఫైబర్లు చిక్కుళ్లు, ఆకు పచ్చ కూరగాయలు, గింజలు, బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ క్రియకూడా మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇవి గ్యాస్ట్రిక్ నొప్పిని కూడా తగ్గిస్తాయి.
 

77

కూరగాయలు: కొన్ని రకాల కూరగాయలు గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడంలో ముందుంటాయి. బంగాళదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు నొప్పి సమస్య నుంచి మనల్ని బయటపడేలా చేస్తాయి. అలాగే గుమ్మడికాయ రసం కూడా గ్యాస్ట్రిక్ ఆమ్లతను తగ్గించే ఔషద గుణాన్ని కలిగి ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు
Recommended image2
Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Recommended image3
Gut Health: పేగుల ఆరోగ్యం కోసం ఈ 7 పండ్లు తినండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved