Fat : పొట్టను కరిగించే ఆహారపదార్థాలు ఇవే..
Fat : ఓట్స్, గుడ్లు, టొమాటోలను తరచుగా తినడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు టొమాటోలను తినడం వల్ల క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను చంపేస్తుంది.

వయసు మీద పడుతున్న కొద్దీ Metabolism క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల వీరి శరీరంలో ఫ్యాట్ పేరుకుపోతుంది. ముఖ్యంగా వీరిలో నడుము, పొట్ట భాగంలోనే ఫ్యాట్ పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించడానికి ఎక్సర్ సైజెస్ చేయడంతో పాటుగా కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా కరిగించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
గ్రీన్ టీ: కొవ్వులను కరిగించడానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉండేవారు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును నియంత్రిస్తాయి.
తేనె: కొవ్వును కరిగించే ఆహార పదార్థాల్లో తేనె ముందుంటుంది. అందుకే చాలా మంది పరిగడుపున గోరువెచ్చని నీళ్లలో కాస్త నిమ్మరసం, తేనెను మిక్స్ చేసి తాగుతుంటారు. దీనివల్ల పొట్ట కొవ్వు తొందరగా తగ్గుతుంది.
ఆపిల్: ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతే కాదు వీటిని తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోజుకు ఒక ఆపిల్ పండు తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్స్ ను ఇష్టపడని వారంటూ ఉండరేమో కదా.. ఈ చాక్లెట్లలో ఫ్లావనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన బాడీలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది.
టొమాటో: మనం తినే ప్రతి వంటలో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు తెలుసా.. టొమాటోలను నిత్యం తినడం వల్ల క్యాన్సర్ కు దారితీసే కణాలు చనిపోతాయి. వీటిని రోజు వారి ఆహారంలో తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
green-chillies
పచ్చి మిరపకాయలు: పచ్చి మిరపకాయల్లో క్యాప్ల్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బాడీ ఎదుగుదలకు తోడ్పడే కణాలను పెంచుతుంది. అంతేకాదు ఈ మిరపకాయలు కొవ్వును కూడా కరిగించగలవు.
గుడ్లు: గుడ్లు మంచి ప్రోటీన్ ఫుడ్. గుడ్డు సంపూర్ణ ఆహారం కూడా. వీటిని నిత్యం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే కండరాలు బలంగా తయారవుతాయి.
వెల్లుల్లి: ఇందులో ఆలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ ను , ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.