MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అమ్మమ్మ చెప్పిన చిట్కాలు.. వంటింట్లో ఈ పనులు చేస్తే ఆ నష్టాలు ఉండవు!

అమ్మమ్మ చెప్పిన చిట్కాలు.. వంటింట్లో ఈ పనులు చేస్తే ఆ నష్టాలు ఉండవు!

సాధారణంగా ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా వంట గదిలోని తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. 

2 Min read
Author : Navya G
Published : Sep 16 2022, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతిరోజు ఎన్నో ఆహార పదార్థాలను తయారు చేస్తూ అందరి అవసరాలను తీరుస్తుంటారు. అయితే వంటిల్లును చక్క పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఆ మహిళపై ఉంటుంది అయితే కొన్నిసార్లు మనం చేసే వంటలు చెడిపోవడం లేదా పాడవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
 

25

పూర్వకాలం మన ఇంట్లో ఇప్పటిలాగా ఫ్రిజ్ లు ఉండేది కాదు. అందుకే ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడం కోసం పెద్దవాళ్ళు ఎన్నో చిట్కాలను పాటించేవారు అయితే అప్పట్లో అమ్మమ్మలు పాటించే చిట్కాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా మనం బెండకాయతో ఏదైనా తాలింపు చేసే సమయంలో మొత్తం జిగటగా ఉంటుంది. ఇలా జిగటగా ఉండకూడదు అంటే బెండకాయ ముక్కలపై నిమ్మరసం చల్లి వంట చేస్తే జిగటు ఉండదు.
 

35

ఇక వంకాయలను మనం కట్ చేసేటప్పుడు వెంటనే రంగు మారుతుంది. అలాగే కూర చేసినప్పుడు కూడా రంగు మారుతుంది ఇలా రంగు మారకుండా ఉండాలంటే వంకాయ కూర చేసేటప్పుడు రెండు చుక్కలు నిమ్మరసం వేయటం వల్ల కూరలో మార్పు ఉండదు అలాగే కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక మన ఇంట్లో ఏదైనా రాగి సామాన్లను శుభ్రం చేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు అయితే వీటిని శుభ్రం చేసే ముందు కొద్దిగా నిమ్మరసంతో శుభ్రం చేస్తే కొత్త వాటిలా మెరుస్తుంటాయి.
 

45

ఇక మన ఇంట్లో చీమలు బారులు కడుతూ వెళ్తుంటాయి ఇలా వీటిని అధిగమించాలంటే కాస్త నిమ్మరసం వేయటం వల్ల ఈ చీమల బెడద నుంచి తప్పుకోవచ్చు. ఇక చాలామంది ఇళ్లలో తొందరగా పెరుగు పాడవుతుంది. ఇలా పెరుగు పాడవకుండా పుల్లగా ఉండాలంటే కొద్దిగా కొబ్బరి ముక్క వేస్తే పెరుగు తొందరగా పాడవ్వదు. మన ఇంట్లో పూజ చేసిన తర్వాత అగర బత్తి సుసితో ఇత్తడి పాత్రలను కడగటం వల్ల బాగా శుభ్రపడతాయి..
 

55

కత్తిపీట తెగకుండా ఇబ్బంది పెడుతుంటే మనం కూరగాయలు కోసేముందు ఉప్పుతో రుద్దడం వల్ల పదునుగా తయారవుతుంది. ఇక మినప్పప్పు వంటివి తొందరగా నానాలంటే మనం నానబెట్టి నీటిలో ఇనుప ముక్కను వేయటం వల్ల తొందరగా నానుతాయి.బ్రెడ్ తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే బ్రెడ్ ప్యాకెట్ లో చిన్న బంగాళదుంప ముక్క వేయడం వల్ల బ్రెడ్ పాడవకుండా తాజాగా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఎన్నో ఆహార పదార్థాలను చెడిపోకుండా కాపాడుకోవచ్చు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Recommended image2
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?
Recommended image3
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved