DMart: డి-మార్ట్‌లో ఈ 5 వస్తువులు కొనే ముందు ఆలోచించండి.. తొందరపడకండి
DMart: డి-మార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు అన్నీ చవకగా వస్తాయని తెగ కొనేస్తూ ఉంటారు. కానీ 5 వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

డిమార్ట్ లో ధరలు తక్కువ కానీ..
చాలామంది డి-మార్ట్‌కు వెళ్లగానే అనుకున్న దానికంటే ఎక్కువ కొనేస్తారు. "బయట కంటే ఇక్కడ తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి, డబ్బులు మిగులుతాయి" అనుకుని తమ తాము అనుకున్న బడ్జెట్ దాటిపోయినా ఖర్చు పెడతారు. డిమార్ట్ లో చాలా అవసరమైన వస్తువులు ఆఫర్ ధరలో దొరుకుతాయి. అవి ప్రస్తుతం ఇంట్లో అవసరం ఉన్నాయో లేదో ఆలోచించకుండా కొంతమంది కొనేస్తూ ఉంటారు. అలాంటి వాటిని తగ్గించుకుంటే బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఎలాంటివి ఎక్కువగా కొనడం తగ్గించుకోవాలంటే..
- స్నాక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్
డి-మార్ట్ స్టోర్లలో స్నాక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇన్‌స్టంట్ ఫుడ్స్ లాంటివి వెంటనే కనిపించేలా పెడతారు. వాటిపైనే ఆఫర్లు కూడా పెడతారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వంటి ఆఫర్లు అధికంగా ఉంటాయి. ₹100 విలువైన స్నాక్ ప్యాకెట్ ₹80 కే వస్తుందని పెడతారు. వెంటనే చాలా మంది వాటిని కొనేస్తారు. ఆ వస్తువు మీ షాపింగ్ లిస్ట్‌లో లేకపోయినా ఆఫర్లు చూసి టెంప్ట్ అయిపోయి కొనేస్తారు. ఇలా బడ్జెట్ పెరిగిపోతుంది. కాబట్టి అవసరం లేనివి కొనకూడదు.
2. ఖరీదైన స్పెషల్ ఫుడ్ ఐటమ్స్
డ్రై ఫ్రూట్స్ వంటివి డిమార్ట్ లో భారీగా అమ్మకాలు చేస్తారు. వాటిని కొనేటప్పుడు ధరలు పోల్చి చూసుకోవడం ముఖ్యం. ప్రీమియం ప్యాకేజింగ్, ఇంపోర్టెడ్ వెరైటీలు లేదా పెద్ద బ్రాండ్ల పేరుతో డిమార్ట్ లో ఇవి ఎక్కువ ధరకు కూడా అమ్ముతారు. చూసుకోకుండా కొంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావచ్చు.
3. పెద్ద ప్యాక్‌లు (జంబో ప్యాక్స్)
"ఫ్యామిలీ ప్యాక్", "వాల్యూ ప్యాక్" లేదా "జంబో ప్యాక్" ఇలా అనేక రకాలుగా డిమార్ట్ లో అమ్మకాలు జరుగుతాయి. వాటిని చూడగానే అది బెస్ట్ డీల్ అని గుడ్డిగా నమ్మేసి కొనేస్తారు. కొన్ని వస్తువులను పెద్ద ప్యాక్‌లలో కొనడం నిజంగానే లాభం. కానీ ఇంట్లో ఆ వస్తువు వాడకం తక్కువగా ఉంటే, పెద్ద మొత్తంలో కొనడం వల్ల అది వృధా అవుతుంది. మనీ కూడా వేస్టవుతుంది. కాబట్టి తక్కువ ధరకు వస్తుంది కదా అని జంబో ప్యాక్ లు కొంటే జేబుకు చిల్లు పడుతుంది. ఎంత అవసరమో అంతే కొనుక్కోండి.
4. ప్రీమియం ఓట్స్, ఖరీదైన బ్రేక్‌ఫాస్ట్ ప్రొడక్ట్స్
బ్రేక్‌ఫాస్ట్ సెరీల్స్, ఓట్స్, మ్యూస్లీ లాంటివి బ్రాండ్, వెరైటీని బట్టి ధరలు మారుతుంటాయి. అవన్నీ ఒకే రకమైన ప్రొడక్ట్స్ అయినా, ఫ్లేవర్డ్, ఇన్‌స్టంట్ లేదా ప్రీమియం వెరైటీలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి వాటిని కొనాలంటే ఒకసారి ధరలు పోల్చుకుని కొనాలి. ఒక ఓట్స్ ప్యాకెట్ 500 గ్రాములకు ₹100 ఉంటే, మరో ప్యాకెట్ 1 కేజీకి ₹180 ఉండొచ్చు. కిలో కొంటే 20 రూపాయల తగ్గుతుందని పెద్ద ప్యాకెట్ తీసుకుంటారు చాలా మంది. కానీ మీ ఇంట్లో ఆ 1 కేజీని ఎంత త్వరగా వాడతారన్నది కూడా ముఖ్యమే. ఇంట్లో ఇద్దరే ఓట్స్ తింటుంటే, పెద్ద ప్యాకెట్ కొనాల్సిన అవసరం లేదు. ఎంత అవసరమో అంతే కొంటే ఖర్చు అదుపులో ఉంటుంది.
5. బై మోర్, సేవ్ మోర్.. కాంబో ఆఫర్స్
"ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేయండి" వంటి కాంబో ఆఫర్స్ చూసి పడిపోకండి. “బై 4 గెట్ 1 ఫ్రీ”, “బై 2 గెట్ ఎక్స్‌ట్రా”, “ఫ్యామిలీ కాంబో” లాంటి ఆఫర్లు చూడగానే, వెంటనే కొనేయాలనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగాలి. "ఈ ఆఫర్ లేకపోయినా నేను దీన్ని కొనేవాడినా?" అని. మీ సమాధానం "కాదు" అయితే, ఆ ఆఫర్ వల్ల మీకు ఎలాంటి లాభం లేదు. ఆఫర్లు చూసి పడిపోయి ఏవీ కొనకండి. మీ ఇంటికి ఏవి అవసరమో అవే కొనుక్కోండి. ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి.

