Beauty Tips: అబ్బాయిలు.. మీ పొట్ట దాచాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!
Beauty Tips: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతున్న సమస్య బాన పొట్ట. అలాంటి బాన పొట్టని దాచిపెట్టడానికి అబ్బాయిలకి కొన్ని చిట్కాలు ఉన్నాయంట. అవేంటో చూద్దాం.
నేటి జీవన శైలి వలన చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాన పొట్టతో బాధపడుతున్నారు. దీనికి కారణం టైం కి తిండి తినకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం,సరి అయిన జీవన విధానం లేకపోవడం. ఏది ఏమైనాప్పటికీ మనిషి ఎంత అందంగా ఉన్నా బాన పొట్ట వాళ్ల అందాన్ని పాడుచేస్తుంది.
అయితే అబ్బాయిలకి ఆ బాన పొట్ట తగ్గించుకోవడానికి ఉన్న చిట్కాలు ఏంటో చూద్దాం. సాధారణంగా పురుషుల నడుము కొలత 40 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువగా ఉంటే అది బాన పొట్ట కిందకే వస్తుంది. సరియైన జాగ్రత్తలు తీసుకుంటే బానపట్టనే కరిగించడం పెద్ద సమస్య కాదు.
కానీ అప్పటికప్పుడు వచ్చే ఫంక్షన్లకు, మీటింగ్లకి వెళ్లాలంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని బాన పొట్టని కనిపించకుండా చేయవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు టైట్ దుస్తులు అవాయిడ్ చేయండి. అలాగే వేసుకునే టీ షర్ట్ లు కొంచెం వదులుగా ఉండేలాగా చూసుకోండి.
అలాగే ఒక మంచి జాకెట్ ధరించటం వలన ఎత్తైన మీ పొట్ట కనిపించకుండా ఉంటుంది. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటే ఎదుటి వాళ్ళ దృష్టి మీ పొట్ట మీద కాకుండా మీ స్టైల్ మీద పడుతుంది కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్ బాగుండేలాగా చూసుకోండి.
మీకు పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త మంచి బట్టల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్టల యొక్క కరెక్ట్ కాంబినేషన్ మన శరీరంలో ఉండే లోపాలని చాలా మటుకు కప్పిపుచ్చుతాయి. అలాగే మీరు వేసుకునే బట్టలు ముదురు రంగులో ఉంటే స్లిమ్ గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
డార్క్ కలర్ దుస్తుల అనుకరణ అంటే చర్యల వలన మీరు చురుకైన రూపాన్ని కలిగి ఉంటారు. దానికోసం మీరు నీలం, నలుపు, గోధుమ రంగు మొదలైన ముదురు రంగులను ఎంపిక చేసుకోవచ్చు.