HealthTips: చేజేతులా మన కాలేయాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం..ఎలాగో తెలుసా!
చక్కెర, అధికంగా మందులు వాడటం, నీరు తక్కువగా తాగడం వంటి అలవాట్లు కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంటాయి. వెంటనే వాటిని గుర్తించి కాలేయాన్ని కాపాడుకోవాలి.

శరీరాన్ని సజీవంగా
శరీరంలో నిత్యం పని చేసే కీలక అవయవాల్లో కాలేయం (liver) ఒకటి. ఇది రోజంతా విషపదార్థాలను తొలగించడంతో పాటు, శక్తినిచ్చే పోషకాలను నిల్వ చేసి శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది. అయితే మనం తెలియకపోయినా కొన్ని రోజువారీ అలవాట్లతో దీన్ని బలహీనపరుస్తున్నాం.
అధికంగా చక్కెర తీసుకోవడం
ఫ్రూట్ జ్యూస్‌లు సహా హెల్తీగా అనిపించే పానీయాల్లో కూడా అధిక చక్కెర ఉంటుంది. ఇవి కాలేయంలో కొవ్వుగా మారి ఫ్యాటి లివర్‌కి దారితీస్తాయి.
శారీరక శ్రమ లేకుండా జీవనం గడపడం
రోజంతా కూర్చునే జీవనశైలీ ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో కాలేయం చుట్టూ కొవ్వు పెరిగి ప్రమాదకర స్థితికి దారితీస్తుంది.
తలనొప్పికి తరచూ నొప్పినివారణ మందులు
తలనొప్పికి తరచూ నొప్పినివారణ మందులు విపరీతంగా పారాసెటమాల్ వాడటం కాలేయ పనితీరును దెబ్బతీయొచ్చు. ఇది కాలేయానికి ముప్పు తెస్తుంది.
సమయానికి తినకపోవడం
వేళకి తినకపోవడం లేదా పూర్తిగా ఆహార సమూహాలను తొలగించే డైట్స్ పాటించడం కూడా కాలేయానికి హానికరం.
కృత్రిమ తీపి పదార్థాలు & డైట్ సోడాలు
ఇవి గట్ బ్యాక్టీరియాను ప్రభావితం చేసి ఇన్సులిన్ నిరోధకత పెంచుతాయి. దీని ప్రభావం కాలేయంపై కూడా పడుతుంది.
నీరు తక్కువ తాగడం
శరీరం డీహైడ్రేట్ కావడం వల్ల కాలేయానికి అవసరమైన సహాయం అందదు. సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం.
హెర్బల్ సప్లిమెంట్ల వాడకం
‘నేచురల్’ లేదా ‘హెర్బల్’ అని నమ్మి తీసుకునే కొన్ని సప్లిమెంట్లు కాలేయంపై దుష్ప్రభావం చూపవచ్చు.
నిద్రలేమి
నిద్రలేమి కనీసం 7–8 గంటల నిద్ర అవసరం. రాత్రివేళ కాలేయం శుద్ధి ప్రక్రియలో ఉంటుంది. నిద్రలేమి వల్ల ఇది రద్దీగా మారుతుంది.