sleepiness: ఎంత ప్రయత్నించినా పగటి పూట నిద్ర ఆడగం లేదా? అయితే ఇలా చేయండి..
sleepiness: రాత్రిపూట కంటే పగటిపూటే ఎక్కువగా పడుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ పగటి పూట నిద్రపోతే ఆ రోజంతా డల్ గా ఉంటుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే పగటి పూట అస్సలు నిద్రపోరు.

చాలా మందికి పగటి నిద్రపోయే అలవాటుంటుంది. ఇక కొందరు ఆఫీసులకు వెళ్లేవారు మధ్యాహ్నం తిన్న తర్వాత కునుకిపాట్లు పడుతుంటారు. ఇక ఈ నిద్రను ఆపుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ నిద్రను మాత్రం ఆపుకోలేక తిప్పలు పడుతుంటారు. ఇలా నిద్రమత్తు వల్ల పనిని కూడా సరిగ్గా చేయలేరు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. పగటిపూట నిద్రమత్తు నుంచి విముక్తి పొందవచ్చు.
రాత్రి నిద్ర.. రాత్రిళ్లు నిద్రపోని వారే పగటి పూట ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంది. అందుకే రాత్రుళ్లు ఎక్కువగా నిద్రపోండి. కనీసం రోజుకు 8 గంటలు పడుకుంటే పగటిపూట నిద్ర వచ్చే అవకాశం ఉండదు.
హైడ్రేషన్.. తీవ్రమైన ఎండలకు, ఉక్కపోతలకు ఒంట్లో ఉండే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దీంతో కూడా అలసటగా అనిపించి నిద్రొస్తుంటుంది. అందుకే బాడీకి శక్తినిచ్చే, హైడ్రేటెడ్ గా ఉంచే పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్లు, నిమ్మరసం వంటివి ఎక్కువగా తీసుకుంటే నిద్రమత్తు వదిలిపోవడమే కాదు యాక్టీవ్ గా మారిపోతారు.
కాఫీ, ఆల్కహాల్.. కాఫీలో ఉండే కెఫిన్, ఆల్కహాల్ నిద్రపై చెడు ప్రభావాన్నిచూపిస్తాయి. ఇవి ఎక్కువైనా రాత్రుళ్లు మీరు సరిగ్గా నిద్రపోలేరు. అందుకే రాత్రుళ్లు వీటి జోలికి వెల్లకండి.
జంక్ ఫుడ్.. ఫుడు ను హెవీగా తీసుకున్నా నిద్రొస్తుంది. అలాగే జంక్ ఫుడ్ కూడా నిద్రమత్తుకు కారణమవుతుంది. కాబట్టి కడుపును తేలిగ్గా ఉంచే ఆహారాలను మాత్రమే తినండి. లేదంటే ఈ సమస్యను ఎదుర్కోకతప్పదు.
వ్యాయామం చేస్తే.. వర్కౌట్స్ మనల్ని ఫిట్ గా ఉంచడంతో పాటుగా యాక్టీవ్ గా కూడా ఉంచుతాయి. ప్రతిరోజూ పొద్దున్నే, సాయంత్రం వేళల్లో కాసేపు వ్యాయామం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా పగటిపూట కునికి పాట్లు కూడా దూరమవుతుంటాయి.
బీపీ.. రక్తపోటు తగ్గితే కూడా పగటిపూట నిద్రొస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పగటిపూట నిద్రపోయే వారు ఒకసారి రక్తపోటు టెస్ట్ ను చేసుకోవాలి.
పవర్ న్యాప్.. పగటిపూట ఆపుకోలేనంతగా నిద్ర ముంచుకొస్తుంటే మాత్రం ఒక 20 నిమిషాలు పడుకుంటే బెటర్. దీంతో మీ నిద్రమత్తు కూడా వదులుతుంది. కానీ నిద్రొస్తుంది కదా అని పొద్దంతా పడుకుంటే మీరు నిద్రించే సమయాలు తారుమారవుతాయి. దీంతో మీ హెల్త్ ప్రమాదంలో పడుతుంది.