- Home
- Life
- Cracked Heels : పాదాల పగుళ్లతో ఇబ్బందిపడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి.. వెంటనే తగ్గిపోతాయి..
Cracked Heels : పాదాల పగుళ్లతో ఇబ్బందిపడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి.. వెంటనే తగ్గిపోతాయి..
Cracked Heels : పాదాలను నీటిలో కాసేపు ఉంచి, వాటిని మాయిశ్చరైజ్ చేయడం వల్ల పగుళ్లను మటుమాయం అవుతాయి. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేస్తే పగుళ్లు వెంటనే మటుమాయం అవుతాయి.

మీ పాదాల పగుళ్లను అంత తేలిగ్గా తీసిపారేయడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే ఇది పాదాలు పొడిబారడానికి కారణమవుతుంది . ఆ తరువాత చర్మం డ్రైగా మారి పాదాలు పగుళ్లకు గురవుతాయి. ఆ తర్వాత పాదాలు వాపుకు గురవుతాయి.
పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా పదాలు పగుళ్లకు గురవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టండి.. ప్యూమిస్ స్టోన్ తో పాదాలను స్క్రబ్ చేయండి. అలాగే పాదాలను నీటిలో కాసేపు ఉంచి, వాటిని మాయిశ్చరైజ్ చేయడం వల్ల పగుళ్లు మటుమాయం అవుతాయి. వారానికి కనీసం రెండుసార్లు అయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆ తర్వాత మీ పాదాలకు ఉత్తమ మాయిశ్చరైజర్ ను వాడండి. అందులో సాలిసిలిక్ ఆమ్లం వంటి పదార్థాలు ఉండేట్టు చూసుకోండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి.
తేనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పొడి పాదాలను నయం చేయడానికి , మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.
కొబ్బరి రూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. పాదాలు పగుళ్లకు గురికావడం, పగుళ్ల నుంచి రక్తం కారడం లేదా సంక్రామ్యతకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే ఇది నయం చేస్తుంది.
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వారానికి మూడు నాలుగు సార్లు పాదాలకు అప్లై చేయడం వల్ల పొడిబారడాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.
మీరు ఎంచుకున్న ఉత్పత్తిలో సాలిసిలిక్ ఆమ్లం లేదా యూరియా వంటి పదార్థాలు ఉండాలి. ఉత్తమ మాయిశ్చరైజర్ లేదా బామ్ ను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
పాదాల పగుళ్లను తగ్గించడానికి అరటిపండును గుజ్జుగా చేసి పగుళ్లకు పట్టించండి. దీనిని 20 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత కూల్ వాటర్ తో కడగండి. ఆ తర్వాత బకెట్ గోరువెచ్చని నీళ్లలో కాస్త నిమ్మరసం వేసి అందులో మీ పాదాలను పెట్టండి. ఇలా చేయడం వల్ల పగుళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
పాదాల పగుళ్లకు రోజ్ వాటర్ చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇందుకోసం పగిలిన పాదాలను కాసేపు రోజ్ వాటర్ లో ఉంచండి.