చలికాలమని వెల్లుల్లిని ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..
వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ ఎరుకే. అయితే వెల్లుల్లిని ఈ చలికాలం మరీ ఎక్కువగా తింటుంటారు. వెల్లుల్లిని తినడం వల్ల ప్రయోజనాలున్నా.. కొంతమంది మాత్రం వీటిని అసలే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో వెల్లుల్లి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ఈ సీజన్ లో చాలా మంది వెల్లుల్లిని ఎక్కువగా తింటుంటారు. వెల్లుల్లిని ప్రతి కూరలో వేస్తుంటారు. ఇది దాని రుచిని మాత్రమే పెంచుతుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఇది ఎన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ వెల్లుల్లిని కూరలోనే కాదు.. కొంతమంది ఉదయం పచ్చిగా కూడా తింటుంటారు. ఇది చాలా మందికి మంచిదే అయినప్పటికీ.. కొంతమంది వెల్లుల్లి అసలే తినకూడదు. ఎందుకంటే..
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అందుకే దీనిని చలికాలంలో తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇవే కాదు వెల్లుల్లి వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ అందరూ వీటిని తినకూడదు. అసలు ఎవరెవరు వెల్లుల్లిని తినకూడదు? ఎందుకు తినకూడదో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఎసిడిటీ
ఎసిడిటీ సమస్యలు వారు వెల్లుల్లిని అసలే తినకూడదు. ఎందుకంటే వీళ్లు వెల్లుల్లి తినడం వల్ల గుండెల్లో మంట కలుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపున వెల్లుల్లిని తింటే మీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.
సున్నితమైన కడుపు
బలహీనమైన లేదా సున్నితమైన కడుపు ఉన్నవారు కూడా వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే వీళ్లు వెల్లుల్లిని తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు దీనిని తినడం మళ్లీ మళ్లీ వాష్ రూమ్ కు వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి వారు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది.
శ్వాస లేదా వాసన సమస్యలు
కొంతమంది శ్వాస, శరీర దుర్వాసన సమస్యలతో బాధపడుతుంటారు. అయితే చెడు శ్వాసను వదిలించుకోవడానికి వెల్లుల్లిని తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ సమస్యలు ఉన్న వారు వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లి శ్వాస సమస్యను పెంచుతుంది. శరీర దుర్వాసను కూడా పెంచుతుంది.
రక్తం పలుచగా
సాధారణంగా గుండె జబ్బులు ఉన్నవారు ఇంకొన్ని సమస్యలు ఉన్నవారు రక్తం పలుచగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. కానీ ఇలాంటి వారు వెల్లుల్లిని ఎక్కువగా తినకకూడదు. ఇది మీ రక్తాన్ని మరీ పలుచగా చేస్తుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
Garlic
వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లి అందరికీ హాని కలిగించదు. వాస్తవానికి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు లేనివారికి వెల్లుల్లి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి అంటువ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెల్లుల్లి జలుబును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే చలికాలంలో సూప్ లు, కూరగాయలలో తప్పకుండా చేర్చాలని నిపుణులు సలహానిస్తుంటారు. చలికాలంలో ఎక్కువగా జలుబు, ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంటారు. ఈ సీజన్ లో వెల్లుల్లిని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరిగి ఈ అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.