MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Trisha Fitness: 43 ఏళ్ల వయసులో త్రిష అంత అందంగా ఉండటానికి కారణం ఈ ఫుడ్స్

Trisha Fitness: 43 ఏళ్ల వయసులో త్రిష అంత అందంగా ఉండటానికి కారణం ఈ ఫుడ్స్

Trisha Fitness:  హీరోయిన్ త్రిష వయసు 43వ పుట్టినరోజును నిర్వహించుకుంది. అంత వయసులోనూ ఆమె కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా అందంగా కనిపిస్తోంది.తన అందం, ఫిట్‌నెస్ వెనుకున్న రహస్యాలను ఆమె షేర్ చేసుకున్నారు.

2 Min read
Author : Haritha Chappa
Published : May 08 2026, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నలభై ఏళ్లు దాటినా అదే అందం
Image Credit : instagram

నలభై ఏళ్లు దాటినా అదే అందం

తమిళ, తెలుగు సినీ అభిమానులకు త్రిష కృష్ణన్ ఎంతో అభిమాన నటి. ఆమెను తన మొదటి సినిమాలో చూసినప్పటి చలాకీతనం, గ్లో ఇప్పటికీ ఆమెలో అలాగే కనిపిస్తున్నాయి. మే 4న త్రిష తన 43వ పుట్టినరోజు నిర్వహించుకుంది. 20 ఏళ్ల వయసులో ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. దీన్నే చాలామంది 'రివర్స్ ఏజింగ్' అంటుంటే, త్రిష మాత్రం సింపుల్ గా తన డైట్ వల్లే ఇలా ఉన్నానని చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్రిష వీటిని తినదు
Image Credit : Instagram

త్రిష వీటిని తినదు

'మనం తినే ఆహారాన్ని బట్టే మన ముఖంలో మెరుపు కనిపిస్తుంది' అని త్రిష నమ్ముతుంది. అందుకే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు ఆమె తినేందుకు ఇష్టపడదు.  పోషకాలు నిండిన, ఇంట్లో వండిన భోజనానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అధిక మసాలాలు, కృత్రిమ పదార్థాలు లేకుండా సింపుల్‌గా తినడం వల్లే తన  చర్మం సహజమైన మెరుపుతో ఉందని త్రిష చాలా సార్లు ఇంటర్య్వూలలో చెప్పారు.

34
త్రిష తినే ఫుడ్స్
Image Credit : instagram /@trishakrishnan

త్రిష తినే ఫుడ్స్

త్రిష ఉదయం లేవగానే కాఫీ, టీలను తాగదు.  గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగుతుంది.  లేదా శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపే గ్రీన్ టీ తీసుకుంటుంది. ఇది శరీరాన్ని శుభ్రపరిచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. తన ముఖంలోని మెరుపుకు ఇదే ముఖ్య కారణమని ఆమె చాలాసార్లు చెప్పారు.

చర్మ ఆరోగ్యం కోసం విటమిన్ సి నిండుగా ఉండే సిట్రస్ పండ్ల పాత్ర గురించి త్రిషకు బాగా తెలుసు. ఆరెంజ్, నిమ్మకాయ వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను ఆమె అధికంగా తింటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. దానితో పాటు, రోజూ పుష్కలంగా నీళ్లు తాగి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటారు.

44
జిమ్ లో సులువైన వ్యాయామాలు
Image Credit : Instagram

జిమ్ లో సులువైన వ్యాయామాలు

ఫిట్‌నెస్ విషయంలో త్రిష చాలా క్రమశిక్షణగా ఉంటుంది.  కేవలం జిమ్ వర్కవుట్లే కాకుండా, పైలేట్స్, స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలను ఆమె క్రమం తప్పకుండా చేస్తారు. వ్యాయామం రక్త ప్రసరణను పెంచి, చెమట ద్వారా విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఇది చర్మానికి సహజమైన గ్లో ఇస్తుంది.

షూటింగ్ పూర్తయి ఇంటికి రాగానే, మేకప్‌ను సరిగ్గా తొలగించడం, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం ఆమె మర్చిపోరు. అన్నింటికంటే ముఖ్యంగా, మనసును ఒత్తిడి లేకుండా ఉంచుకోవడం, తగినంత నిద్రపోవడమే తన అందానికి మూలమని త్రిష గుర్తుచేస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Beer Sales: తెలంగాణలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో బీర్ అమ్మకాలు,ఒక్క ఏప్రిల్ లోనే ఎన్ని బాటిల్స్ తాగేశారో తెలుసా?
Recommended image2
Comedian Satya: ఆ సినిమా దర్శకుడి పేరును తన కూతురికి పెట్టుకున్న కమెడియన్ సత్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved