Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ హెల్తీ ఫుడ్స్ ను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..
Monsoon Health Tips: వర్షాకాలంలో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే ఎలాంటి రోగాలు రావు. లేదంటే సర్వ రోగాలు మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది.

ఇతర సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలోనే దగ్గు, జలుబు, జ్వరం, కడుపు సమస్యలు వంటి వివిధ శారీరక సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా వర్షాల రాకతో బ్యాక్టీరియా, వైరస్ ల సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. ఇవి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలకు, రోగాలకు దారితీస్తాయి. అయితే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా, ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉంటుంది. అయితే ఈ సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సీజనల్ ఫ్రూట్స్ ను రోజుకు ఒకటైనా ఖచ్చితంగా తినండి. బొప్పాయి, దానిమ్మ, లిచ్చి, పియర్స్ వంటి ఆహారాలు ఈ సీజన్ లో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతాయి. ఈ పండ్లన్నింటిలో ఫోలెట్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన మూలకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వర్షకాలంలో మొక్కజొన్నలకు ఏ కొదవా ఉండదు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లుటిన్, ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. మొక్కజొన్నలో ఉండే అనేక పదార్థాలు గట్ లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతాయి.
వర్షాకాలంలో రోజుకు ఒక అరటిపండు తినడం మర్చిపోకండి. ఎందుంటే వర్షాకాలంలో చాలా మందికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను తొలగించేందుకు అరటి ఎంతో సహాయపడుతుంది. అరటి పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.
గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్ లో మరువకుండా రోజుకు ఒకగుడ్డును తినండి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి గుడ్లు సహాయపడతాయి. క్రమం తప్పకుండా గుడ్డును తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే మీ రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఎలక్ట్రోలైట్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సూపర్ డ్రింక్.
వర్షాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్ట్రీట్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. వానాకాలమని నీళ్లను తాగకుండా ఉండేరు. నీళ్లను పుష్కలంగా తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పకుండా తాగండి.