ఇవి తింటే కూడా రాత్రిళ్లు నిద్ర రాదు..
నిద్రలేమికి ఎన్నో కారణాలున్నాయి. కానీ రాత్రిళ్లు కంటి నిండా నిద్రలేకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. పనిపట్ల శ్రద్ధ ఉండదు. చిరాకుగా, ఎప్పుడూ కోపంగా కూడా ఉంటారు.
ప్రస్తుత కాలంలో ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. కానీ సరిగా నిద్రపోకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.
మీకు తెలుసా.. రాత్రిళ్లు 7 నుంచి 9 గంటలు నిద్రపోకపోతే శరీరం బాగా అలసిపోతుంది. ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా పని చేయలేరు. ఫోన్, ల్యాప్ టాప్, టీవీ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం, నిద్రపోయే సమయంలో కెఫిన్ ను తీసుకోవడం, ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటివి నిద్రలేమికి కారణమవుతాయి. అయితే కొన్ని ఆహారాలు మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడితే మరికొన్ని మాత్రం రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి. నిద్రలేమికి దారితీసే ఆహారాలేంటే తెలుసుకుందాం పదండి..
కెఫిన్ పానీయాలు తాగడం
నిజానికి కెఫిన్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయం కప్పు కెఫిన్ ఉండే కాఫీ లేదా టీ తాగడం వల్ల బాడీ హుషారుగా మారుతుంది. అలాగే శరీరానికి శక్తి అందుతుంది. అలాగని కెఫిన్ ను మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఎనర్జీ కూడా పూర్తిగా పోతుంది. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు కెఫెన్ ను తీసుకోవడం వల్ల ఏం చేసినా నిద్ర రానే రాదు. అందుకే సాయంత్రం 6 దాటిన తర్వాత కెఫిన్ పానీయాలను తాగకపోవడమే మంచిది.
ఎనర్జీ డ్రింక్స్ తాగడం
ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. ఇవి కూడా నిద్రను దూరం చేస్తాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ లేదా శరీరానికి శక్తిని అందించే ఇతర మూలికా పదార్థాలు ఉంటాయి. వీటిని మోతాదుకు మించి తాగితే కూడా మొత్తమే పట్టదు.
పడుకునే ముందు కారంగా ఉండే ఆహారాన్ని తినడం
ఏ పూట అయినా స్పైసీ ఫుడ్ ను తినడం మంచిది కాదు. కానీ కొందరు రాత్రి పూట మరీ స్పైసీగా ఉండే ఆహారాన్ని లాగించేస్తుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఎసిడిటీ వస్తుంది. అంతేకాక ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ కు కూడా కారణమవుతుంది. చివరికి మీకు తెల్లవార్లూ నిద్రలేకుండా చేస్తుంది.
గాడ్జెట్లను ఉపయోగించడం
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీంతో అవి బాగా అలసిపోతాయి. అలాగే వాటినుంచి వల్లే బ్లూ లైట్ నిద్రను దూరం చేస్తాయి. అందుకే పడుకునే గంట లేదా రెండు గంటల ముందు ఫోన్లను ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూడటం మానేయండి.
అయితే నిద్రపోయే సమయంలో నీళ్లను ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే నీళ్ల వల్ల మధ్యరాత్రిలో టాయిలెట్ కు మళ్లీ మళ్లీ లేవాల్సి ఉంటుంది. అలాగే పడుకునే ముందు టమాటాలను కూడా తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే టైరమైన్ అనే రసాయనం బ్రెయిన్ ను చురుగ్గా చేస్తుంది. దీంతో మీకు అస్సలు నిద్రలేరాదు. రాత్రిపూట చీజ్ ను తినడం మానేయండి. ఎందుకంటే ఇది అంత తొందరగా అరగదు. దీనివల్ల కూడా మీరు తెల్లవార్లూ జాగారం చేయాల్సి ఉంటుంది. నిద్రను దూరం చేసే టైరమైన్ రెడ్ వైన్, సోయా సాస్, వంకాయలో కూడా ఉంటుంది.
పడుకునే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే హాయిగా నిద్రపడుతుంది. అలాగే డార్క్ చాక్లెట్స్, అరటిపండ్లు, ఓట్స్ మీరు మంచిగా పడుకోవడానికి సహాయపడతాయి. గుడ్డు కూడా మీరు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది. అలాగే వాల్ నట్స్, కివీ ఫ్రూట్స్ కూడా మీకు సహాయపడతాయి.