Health Tips: ఈ పండ్లను తొక్కతో సహా తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయి..
Health Tips: మామిడి పండ్లు, పుచ్చకాయ, దోసకాయ, చిలకడదుంప, నిమ్మకాయ, ఆరెంజ్, కివి వంటి వాటిని తొక్కతో సహా తినడం వల్ల మీ రోగ నిరోధక శక్తిపెరగడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మనల్ని ఎన్నో జబ్బుల నుంచి రక్షించడానికి రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. మరి ఈ రోగ నిరోధక శక్తిని పెంచడానికి కొన్నిరకాల కూరగాయలు, పండ్లు ఎంతో సహాయపడతాయి. కాగా ఈ వేసవిలో కొన్ని రకాల పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి. అలాగే ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా కొన్నింటిని తొక్కతో సహా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వీటిని సలాడ్ లేదా గ్రైండ్ చేసి పేస్ట్ గా తీసుకున్నా ఎన్నో పోషకాలు అందుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ.. పుచ్చకాయలో 90 శాతం నీరుంటుంది. అలాగే జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండును తొక్కతో సహా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాదు అధిక బరువు, హైబీపీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
mango
మామిడి పండు.. మామిడి పండే కాదు దాని తొక్క కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ తొక్కలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ తొక్కలో ఉండే విటమిన్ సి గాయాలను తొందరగా మాన్పడానికి ఉపయోగపడుతుంది. ఈ తొక్కలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
చిలగడదుంప.. చిలకడదుంప తొక్కలో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. దీనితొక్కలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఐరన్ మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి.
దోసకాయ.. దోసకాయలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. దీని తొక్కలో ఫైబర్, పొటాషియం, విటమిన్ కె లు అధిక మొత్తంలో ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తాయి.
ఆరెంజ్.. ఆరెంజ్ తొక్కలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.
నిమ్మకాయ.. నిమ్మ తొక్కలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా ఎముకలను బలోపేతం చేస్తాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా కరిగిస్తాయి.
బంగాళదుంప.. బంగాళాదుప తొక్కలో నియాసిన్, పొటాషియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.
కివి.. కివిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇక దీని తొక్కలో ఉండే ఫైబర్, పీల్ పేగుల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర బరువును కూడా తగ్గిస్తుంది.