బాధగా, లోన్లీగా అనిపించినప్పుడల్లా ఈ పనిచేయండి.. చికెటిలో ఈ ఫీలింగ్ పోతుంది
కొన్ని కొన్ని సార్లు ఎలాంటి ఒత్తిడి ఉన్నా అది మనల్ని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బలహీనంగా మారుస్తుంది. యువత, సీనియర్ సిటిజన్లలో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం ఒంటరితనమేనంటున్నారు నిపుణులు. మరి ఈ లోన్లీనెస్ ను ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్నిసార్లు నిరాశగా, ఒంటరిగా అనిపించడం సర్వ సాధారణం. కానీ చాలా రోజులు, వారాలు ఇలా అనిపించడం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మరి ఒంటిరతనం నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరి జీవితంలో కమ్యూనికేషన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే మీకు ఒంటరిగా అనిపించినప్పుడల్లా మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి. అలాగే మీ సమస్యలను వారితో పంచుకుంటే మీ మనసు రిలాక్స్ అవుతుంది.
మనందరికీ మర్చిపోలేని జ్ఞాపకాలు, అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఇవి మీ మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ మెమోరీస్ లోకి మిమ్మల్ని తీసుకెళుతాయి. అందుకే మీ మనసు విచారంగా, నిరాశగా, ఒంటరిగా అనిపించినప్పుడల్లా వీటిని చూడండి.
ఒంటరిగా ఫీలైనప్పుడల్లా పెయింటింగ్, ఫోటోగ్రఫీ చేయండి. అలాగే పాటలను వినండి. కొత్త భాషలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇష్టమైన ఆటలు ఆడండి. ఇష్టమైన కంటెంట్ ను యూట్యూబ్ లో చూడండి. వీటితో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు మీరు ఇతరుల కంటే భిన్నంగా కనిపిస్తారు.
Image: Getty
అలంకరణ కూడా మన మనస్సును సంతోషకరమైన అనుభూతితో నింపుతుంది. అందుకే ఒంటరితనం మిమ్మల్ని ఎక్కువగా బాధించినప్పుడల్లా మిమ్మల్ని మీరు ముద్దు పెట్టుకోండి. కొత్త హెయిర్ స్టైల్ ను ట్రై చేయండి. ఇష్టమైన బట్టలను వేసుకోండి.
పుస్తకాలకు మించిన మంచి స్నేహితులు ఎవరుంటారు చెప్పండి. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం అంటారు. అందుకే వీటిని చదవడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఒంటరితనం అనే ఫీలింగే రాకుండా చేస్తుంది.
నవ్వు స్ట్రెస్ నంతా పోగొట్టి మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అందుకే మీకు మీరే నవ్వుకుంటూ, నవ్వుతూ ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్నవారికి ఫన్నీ కథలు చెబుతూ నవ్వించండి. నవ్వు ఎన్నో ఎన్నో సమస్యలను మనకు దూరం చేస్తుంది.
పెంపుడు జంతువుల స్నేహం కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఒంటరిగా భావించనివ్వవు. వీటితో ఉంటే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఒంటరిగా ఫీలైనప్పుడల్లా పిల్లలతో సమయం గడపండి. వారి సరదా మాటలు, చిరునవ్వు ముఖం మీ దుఃఖాన్ని దూరం చేస్తాయి.
ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని మీరు ఎవరితో పోల్చుకోకండి. ఇలా చేయడం వల్ల మనసు మరింత కలత చెందుతుంది.
కొన్నిసార్లు మీతో మీరే మాట్లాడుకోండి. మీ బలాలేంటి, విజయాలేంటో నెమరువేసుకోండి. ఇది పాజిటివిటీని ఇస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.