ఈ జ్యూస్‌లతో రక్తహీనత సమస్యలకు చెక్.. ఈ జ్యూస్‌లు ఎలా తయారు చెయ్యాలంటే?
ప్రస్తుత కాలంలో రక్తహీనత (Anemia) సమస్యను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా చాలామంది ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

ఈ సమస్య కారణంగా శరీరం అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) ఎదుర్కొంటోంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్ లను తీసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం తీసుకోవలసిన జ్యూస్ లు ఏంటో.. వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గోర్లు పాలిపోవడం, నాలుక, కనురెప్పల కింద తెల్లగా ఉండడం, చిన్న చిన్న పనులకే అలసిపోవడం, బలహీనంగా (Weakly) ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (Difficulty breathing), ఏ పని చేయాలన్నా ఆసక్తి చూపకపోవడం, నిద్రలేమి, సరిగా ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు రక్తహీనత సమస్యగా భావించాలి.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తపడడం ముఖ్యం. ఈ సమస్య కారణంగా శరీరం అనేక బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, ఫంగస్ ల బారినపడి అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్తం అవసరం. మన శరీరంలో ఫోలిక్ యాసిడ్ (Folic acid), విటమిన్ బి12 (Vitamin B12) లోపం కారణంగా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.
అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో ఉండాలంటే మాంసకృత్తుల తోపాటు ఇనుము (Iron) ఇతర పోషకాలు అవసరం. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఇంట్లోనే పండ్లు, కూరగాయలతో చేసుకునే జ్యూస్ లను తీసుకకుంటే మంచిది. ఈ జ్యూస్ లు రక్తహీనత సమస్యలను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) అందిస్తాయి.
ద్రాక్ష జ్యూస్: మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన రెండు కప్పుల ద్రాక్ష (Grapes), పావు కప్పు పంచదార (Sugar), చిటికెడు ఉప్పు (Pinch of salt), కొన్ని నీళ్లు (Water) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడగట్టుకుని ఒక గ్లాస్ లో తీసుకుని కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి కలుపుకొని తీసుకోవాలి. చల్లగా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తీసుకోండి.
బీట్ రూట్ జ్యూస్: రెండు కప్పుల బీట్ రూట్ (Beat root), పావు కప్పు పంచదార (Sugar), చిన్న అల్లం (Ginger) ముక్క, చిటికెడు ఉప్పు (Salt), కొన్ని నీళ్లు (Water)వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడగట్టుకుని ఒక గ్లాస్ లో తీసుకుని కొద్దిగా నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి కలుపుకొని తీసుకోవాలి. ఒకవేళ బీట్ రూట్ వాసన నచ్చనివారు కొద్దిగా క్యారెట్ ను కూడా కలుపుకొని తీసుకోవచ్చు.
దానిమ్మ జ్యూస్: రెండు కప్పుల దానిమ్మ గింజలు (Pomegranate seeds), ఒక టేబుల్ స్పూన్ పంచదార (Sugar), కొన్ని నీళ్లు (Water) పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడగట్టుకుని ఒక గ్లాస్ లో తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకుంటే సరి. ఇలా ఈ జ్యూస్ ను ప్రతి రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యలు తొందరగా తగ్గుతాయి. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.