Tomatoes: ఈ కూరలు వండేటప్పుడు వాటిలో టమాటాలు వేయకండి, కూర రుచే పోతుంది
Tomatoes: కూరల్లో టమోటాలు వేస్తే ఇగురు బాగా వస్తుందని ప్రతి కూరలో కూడా టమోటాలు వేసేస్తూ ఉంటారు. ఇవి కొంచెం పుల్లని రుచిని కలిగి ఉంటాయి. కొన్ని కూరల్లో టమోటాలను వేస్తే వాటి రుచి చెడిపోతుంది.

టమోటోలు కలపకూడని కూరలు
ప్రతి ఇంట్లోనూ టమోటోలు ఉండడం తప్పనిసరి. బిర్యానీ నుంచి కూరల వరకు అన్నిట్లోనూ టమోటా ముక్కలు వేసేస్తూ ఉంటాము. ఇది వేయడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుందని అనుకుంటాము. అలాగే కూరల్లో ఇగురు బాగా కావాలంటే టమోటా ప్యూరిని వేస్తే సరిపోతుందని ఆ పనే చేస్తాము. టమోటోలు కొద్దిగా పుల్లని రుచిని అందిస్తాయి. అలాగే కూరల రంగును కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి కొన్ని కూరలు ఉండేటప్పుడు టమోటాలు వేయకపోవడమే మంచిది. లేకపోతే రుచితో పాటు వాటి రూపం కూడా దెబ్బతింటుంది. ఏ ఏ కూరగాయలలో టమోటాలు కలిపి వండకూడదో మంచిదో తెలుసుకోండి.
బెండకాయ
బెండకాయలో కూడా టమాటోలు వేసి వండేవారు ఎంతోమంది. బెండకాయ పులుసు పెట్టాలన్నా, ఇగురు పెట్టాలన్నా కచ్చితంగా టమోటోలు ఉండాలనుకుంటారు. నిజానికి బెండకాయతో టమోటాను కలపడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి రుచి రాదు. పైగా వచ్చే రుచి కాస్త అసాధారణంగా అనిపిస్తుంది. మీకు అంతగా పుల్లదనం కావాల్సి వస్తే నిమ్మరసం పిండుకోండి. అంతేగాని బెండకాయలను టమోటాలతో కలిపి వండకండి.
కాకరకాయ
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయ పులుసు చేయాలన్నా, ఇగురు చేయాలన్నా టమోటోలను ఉపయోగించకూడదు. కాకరకాయ కూరలో టమోటాలు కలిస్తే కొంచెం వింతైన రుచి వస్తుంది. కాకరకాయలోని చేదు టమోటాలను పులుపు కలిసి కొత్తగా సృష్టిస్తాయి. మీకు అంతగా కాకరకాయ కూరలో వేయాలనుకుంటే నిమ్మకాయ రసం లేదా మామిడికాయ పొడి వేసి కలుపుకోవడం ఉత్తమం. కానీ కాకరకాయలో టమోటాలను ఎప్పుడూ జోడించకండి
మెంతికూర , బంగాళాదుంప
మెంతికూరలో కూడా టమోటాలను వేయకపోవడమే ఉత్తమం. లేకపోతే కూరంతా అదో రకంగా మారుతుంది. అలాగే బంగాళదుంపలో కూడా బంగాళదుంప కూర కలిపి వండుతూ ఉంటారు. అందులో కూడా ఒకసారి టమోటాలు వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రుచి చెడిపోతుంది. కూర రుచి పుల్లగా మారిపోయి అదోరకంగా ఉంటుంది. ఇందులో మీరు ఎండిన మామిడిపొడిని వేసుకుంటే ఎంతో మంచిది.
బీన్స్ కర్రీ
బీన్స్ కర్రీలో ఎప్పుడూ కూడా టమోటోలను జోడించకూడదు. బీన్స్ ను కాస్త కొబ్బరి పొడి వేసుకొని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లేదా బీన్స్ ఉల్లిపాయల తరుగు కూడా సరిపోతుంది. అందులో టమాటోలు వేయాల్సిన అవసరం లేదు. టమోటోలు వేయడం వల్ల బీన్స్ కూడా సరిగా ఉడకవు. బీన్స్ కర్రీ రుచి మారిపోతుంది. ఇందులో మీరు కేవలం జీలకర్ర, ఉల్లిపాయలు ఇతర మసాలాలు జోడించుకుని వండుకుంటే చాలు. బీన్స్ టమోటో కర్రీ తినేటప్పుడు కూడా పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్లను ఎంత దూరంగా పెడితే అంత మంచిది.

