Donkey Milk గాడిద పాలతో అందం.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివని చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెబితే నమ్మేవాళ్లం కాదు. కానీ ఈ మధ్య ఆరోగ్యం, అందంపై అందరికీ యావ పెరిగాక గాడిద పాలకి డిమాండ్ బాగా పెరుగుతోంది. గాడిద పాలతో ఆరోగ్యమే కాదు.. అందానికీ మంచిదట.

లీటరు రూ.6,000
ఆవు లేదా గేదె పాల కంటే గాడిద పాలు చాలా ఖరీదు అని మీకు తెలుసా? గాడిద పాలు ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది అని అంటారు. గాడిద పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి లాంటి పోషకాలు చాలా ఉన్నాయి. అందుకే గాడిద పాలు అంత రేటు పలుకుతున్నాయి.
వయస్సు మీద పడకుండా ఆపే గుణం
గాడిద పాలలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో గాడిద పాలు వాడటం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆవు లేదా గేదె పాలకి ఎలర్జీ ఉన్నవాళ్లు గాడిద పాలు తాగొచ్చు. ఇది దాదాపు అందరి బాడీ నేచర్‌కి సెట్ అవుతుంది.
రాయల్ సంబంధం
ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేదంట! ఆమె ప్రపంచంలోని అత్యంత అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇలాంటి విషయాలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇప్పుడు గాడిద పాలు ట్రెండ్ అవుతుంటే నిజమేనేమో అనిపిస్తుంది.
కాస్ట్లీ పనీర్ - ఫ్యూల్ చీజ్
గాడిద పాలు తాగడానికి మాత్రమే కాదు, పనీర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు! కాస్ట్లీ పనీర్ - ఫ్యూల్ చీజ్ లాంటి వంటల్లోనూ వాడుతున్నారు. భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్‌లో గాడిద పాల వ్యాపారం జోరుగా ఉంది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా గాడిద పాల వ్యాపారం పెరుగుతోంది.