విటమిన్ డి లోపముంటే బరువు పెరగుతారా?
బరువు ఎక్కువగా ఉన్నవారి శరీరంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్ డి లోపం ఊబకాయంతో సంబంధం ఉందని 2003 లో ఓ అధ్యయనం కనుగొంది.
vitamin d deficiency
ఈ రోజుల్లో ఊబకాయంతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువయ్యారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు.. ఎంతో మంది ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే అధిక బరువు ఉన్నవారి శరీరాల్లో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. బాడీ మాస్ ఇండెక్స్ శరీరంలో ఉన్న విటమిన్ డి మొత్తంతో ప్రత్యక్ష సంబంధం కలిగుందని అధ్యయనాలు తేల్చాయి.
ఎముకల ఆరోగ్యం కోసం శరీరంలో విటమిన్ డి మొత్తం ఎప్పుడూ nmol/L లేదా అంతకంటే ఎక్కువగానే ఉండాలి. ఇంతకంటే తక్కువ, 125 nmol/L కంటే ఎక్కువ అసలే ఉండకూడదని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
విటమిన్ డి లోపం ఉబకాయం పర్యవసానమా?
ఊబకాయుల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే విటమిన్ డి కూడా బరువు పెరిగేందుకు దారితీస్తుందని అర్థమవుతోంది. 2003 లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. శరీరంలో చర్మ, ఆహార వనరుల నుంచి విటమిన్ డి తగ్గడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది ఊబకాయంతో సంబంధం కలిగి ఉందని వెల్లడించింది.
విటమిన్ డి లోపం ఊబకాయాన్ని ప్రేరేపిస్తుందా?
విటమిన్ డికి బరువుకు దగ్గరి సంబంధం ఉంది. అందుకే ఇది బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. విటమిన్ డి కొవ్వుల నిల్వలపై, శరీరంలోని కొవ్వు కణాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు బరువును తగ్గుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది కూడా హార్మోన్ కావడం వల్ల.. శరీరంలోని కొవ్వు సెరోటోనిన్ తో అనుసందానించబడిన న్యూరోట్రాన్స్ మీటర్లను ప్రేరేపింస్తుంది. మన శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటే.. టెస్టోస్టెరాన్, సెరోటోనిన్ స్థాయిలను పెరుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. అలాగే ఆకలిని తగ్గిస్తాయి. అంతేకాదు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయి. ఇవి దీర్ఘకాలక ఓవర్ వెయిట్ తగ్గడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
ఇది కాకుండా విటమిన్ డి మనకు ఎలా సహాయపడుతుంది?
విటమిన్ డి మన శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ మొత్తాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఉండటానికి ఈ విటమిన్ చాలా చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. విటమిన్ డి క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ విటమిన్ డి ఇన్ఫెక్షన్లను కూడా నియంత్రిస్తుంది. మంటను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ డి లోపం సంకేతాలు
విటమిన్ డి లోపం సాధారణ సంకేతాలు: అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పి, బలహీనత, కాళ్ళు, కటి, తుంటిలో ఒత్తిడి పగుళ్లు. కొంతమందిలో విటమిన్ డి లోపం వల్ల ఆకలి లేకపోవడం, తరచుగా అనారోగ్యానికి గురికావడం, జుట్టు రాలడం, నిద్రలేమి, అలసట, నిరాశ వంటి సమస్యలను ఫేస్ చేస్తారు.
సప్లిమెంట్స్ మంచివేనా?
విటమిన్ డిని మొదటగా సూర్యరశ్మి ద్వారానే పొందాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. అయినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితిలో విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. కానీ
సప్లిమెంట్లను డాక్టర్ సూచన లేకుండా మాత్రం తీసుకోకూడదు. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే విటమిన్ డి సప్లిమెంట్లను సరైన మోతాదులోనే తీసుకోవాలి.
విటమిన్ డి ని మోతాదుకు మించి తీసుకుంటే..?
విటమిన్ డి ని మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదకరం. దీన్నే విటమిన్ డి టాక్సిసిటీ అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన వైద్య పరిస్థితి. విటమిన్ డి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం విషపూరితంగా మారుతుంది. దీనివల్ల వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు వస్తాయి. ఇది ఎముక నొప్పి, మూత్రపిండాల సమస్యలను కూడా కలిగిస్తుంది. బోలు ఎముకల వ్యాధి, మూత్రపిండాల ఆస్టియోడిస్ట్రోఫీ, సోరియాసిస్, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, ఉదరకుహర లేదా తాపజనక ప్రేగు వ్యాధి వంటి వ్యాధులకు అధిక విటమిన్ డి స్థాయిలు విషపూరితం అవుతాయి.