Health : ఇంకా సింగిల్ గానే ఉన్నారా? ప్చ్..మీకు ఈ జబ్బులు వచ్చుంటాయిగా..
Health : సింగిల్ గా ఉంటేనే బెస్ట్ రా బాబు.. ఒంటరిగా ఉంటే ఎలాంటి బాధలు ఉండవు తెలుసా.. అంటూ గొప్పలు చెప్పే వారు చాలా మందే ఉన్నారు. వీరికి తెలియని అసలు విషయం ఏంటో తెలుసా..? సింగిల్ గా ఉండటం వల్ల వచ్చే వివిధ అనారోగ్య సమస్యల గురించి. అవును సింగిల్ కింగ్ లము అనుకునే వాళ్లు ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారేమో..

Health : నేను ఇంకా సింగిలే.. అందుకే కింగ్ లా బతుకుతున్నాను అంటూ గొప్పలు చెప్పేవారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. నిజానికి సింగిల్ గా ఉండటం వల్ల ఒక్క లాభం కూడా లేదు సరికదా.. ఎన్నో నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవును సింగిల్ గా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది. బంధాలను కూడా పట్టించుకోరు. ఇది ఆఖరికి మీ ఆయుష్షును తగ్గించేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రీడమ్ పోయిందంటూ జోక్స్.. చాలా మంది పెళ్లితో నా ఫ్రీడమ్ అంతా పోయిందిరా అంటూ తెగ బాధపడిపోతుంటారు. అంతేదెందుకు సింగిల్ లైఫ్ యే బాగుండేదిరా అంటూ నలుగురికి చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఒంటరిగా ఉండటం వల్ల మీకు ఫ్రీడమ్ ఉండొచ్చు కానీ ఆరోగ్యం కాదు. ఎందుకంటే ఒంటరిగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఒంటరిగా ఉండేవారికంటే జంటగా ఉండేవారే ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా.. జంటగా ఉండేవారికంటే.. సింగిల్ గా ఉన్నవాళ్లే తొందరగా చనిపోతున్నారట. చూడండి.. ఒంటరిగా ఉండటం ఎంత డేంజరో..
పెళ్లి అయి విడిపోయిన వాళ్లు కూడా.. పెళ్లి అయ్యి విడిపోయిన వారు చాలా మంది సింగిల్స్ గానే ఉండటానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇలాంటి వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒంటరిగానే ఉండేవాళ్లే కాదు గొడవల కారణంగా విడిపోయిన భార్యా భర్తలు కొంతమందిపై ఈ పరిశోధన చేశారు.
అందుకే భాగస్వామితో గొడవ జరిగినప్పుడు దాన్ని మరింత పెద్దది చేసుకోకుండా.. సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కోండి. బంధాలు బాగున్నప్పుడే మీరు మీ ఆరోగ్యం బాగుంటుందని గుర్తుంచుకోండి. రిలేషన్ షిప్ లో గొడవలు వస్తున్నాయని విడిపోవాలని డిసైడ్ అయితే మాత్రం మీ ఆయుష్షు తొందరగా తీరుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే సమస్యలు.. సింగిల్ గా ఉంటే ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇది ఇన్నో అనర్థాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉంటరిగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ఒంటరిగా ఉండటం వల్ల మెదడులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతారట. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
గొడవలతోనే ఆరోగ్యం.. భార్యా భర్తల మధ్యన గొడవలు రావడం చాలా కామన్. కొంతమంది సరైన రీజన్ తోనే గొడవలు పెట్టుకుంటే మరికొంతమంది మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పెట్టుకుంటారు. ఈ సమయంలో ఇతరులను బాధపెట్టే మాటలు ఎన్నో అనుకుంటూ ఉంటారు. గొడవ పడటం, మాటలు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ వీటిని వీలైనంత తొందరగా మర్చిపోయి ఒక్కటవ్వాలి.
ముఖ్యంగా గొడవలు పడటం కామనే కానీ.. జీవితాంతం గొడవలతోనే గడపడం మాత్రం మంచిది కాదు. మీ కు ఏ విషయంలో గొడవలు జరుగుతున్నాయో తెలుసుకుని ఆ తప్పులు జరగకుండా చూసుకోండి. దీంతో మీరు హ్యాపీగా ఉంటారు.
ఏన్నాళ్లకైనా ప్రతి వ్యక్తి పెళ్లిచేసుకోకతప్పదు. అందులోనూ కొన్ని రోజులు రిలేషన్ షిప్ లో ఉండి విడిపోయిన వారిని అడగండి.. ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో. అందుకే సింగిల్ లైఫ్ కు పుల్ స్టాప్ పెట్టి జోడితో ఎంజాయ్ చేయండి. అప్పుడే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. అయినా ఒకే విధమైన లైఫ్ అంటే కొన్ని రోజులకు బోర్ వస్తుంది. అలకలు, కొట్లాటలు, గొడవలు, ప్రేమ వంటి వివిధ భావోద్వేగాలను అనుభవించినప్పుడే కదా మీకు అసలైన లైఫ్ అంటే ఏంటో తెలిసేది..