Diabetes: స్వీట్స్ తిని నీళ్లను తాగితే డయాబెటీస్ వస్తుంది జాగ్రత్త..
Diabetes: స్వీట్స్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరేమో. అయితే చాలా మంది స్వీట్లను తిని వెంటనే నీళ్లను తాగేస్తుంటారు. నిజానికి స్వీట్స్ తిని నీళ్లను తాగితే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

తీపి, పుల్లని, మసాలా వంటి రుచుల్లో చాలా మంది స్వీట్లనే ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా మంచి విషమయైనా.. పండుగ అయినా.. పార్టీ అయినా స్వీట్స్ పక్కాగా ఉంటాయి. స్వీట్లను శుభ సందర్భాల్లోనే కాదు రోజూ తినే వారు కూడా ఉన్నారు. కానీ స్వీట్లను ఎక్కువగా తినడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది పొత్తి కడుపు నొప్పి, కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా జీర్ణక్రియకూ హాని చేస్తుంది.
సాధారణంగా స్వీట్లు తిన్న వెంటనే నీళ్లను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే స్వీట్లు తిన్న వెంటనే నోరంతా తియ్యగా అనిపిస్తుంది. దీంతో నీళ్లు తాగాలనే కోరిక పుడుతుంది. కానీ స్వీట్లు తిన్న తర్వాత నీళ్లను తాగడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్న విషయం మీకు తెలుసా..?
స్వీట్లు తిన్న తర్వాత నీరు తాగొద్దు.. మధుమేహం ఉన్నవారు స్వీట్లను అసలే తినకూడదు. ఎందుకంటే వీళ్లు స్వీట్లు తినడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. అయితే ఇతరులు స్వీట్లు తినేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. కొంతమందికి స్వీట్లు తిన్న వెంటనే బాగా దాహం వేస్తుంది. దీంతో వారు వెంటనే కోల్ట్ డ్రింకులు లేదా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. లేకపోతే నీళ్లను తాగుతారు. దీనివల్ల మీరు దీర్ఘకాలిక అనారోగ్యం బారినపడొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇలా తాగడం వల్ల మధుమేహం త్వరగా వస్తుందని హెచ్చరిస్తున్నారు.
స్వీట్లు తిని నీళ్లను తాగే అలవాటు టైప్ 2 డయాబెటిస్ , ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు వెల్లడించారు.
స్వీట్లు తిన్న తర్వాత నీరు తాగితే మధుమేహం ఎందుకు వస్తుంది?
స్వీట్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల మధుమేహం రావడానికి ఒక నిర్దిష్ట కారణం కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం.. స్వీట్లలో లభించే చక్కెర పరిమాణం.. శరీర రక్తంలో నీటి పరిమాణం త్వరగా కరిగిపోవడమే. ముఖ్యంగా ఏదైనా స్వీట్లు తిన్న వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది మధుమేహం లక్షణాలను పెంచుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలను కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కొంతమందికి మైకము వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.
డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మనల్ని వదిలిపెట్టదు. అయితే మీరు సరైన ఆహారం తీసుకుంటూ వైద్యుడి సలహాను పాటిస్తేనే వ్యాధిని అదుపులో ఉంటుంది. అందుకే దీని బారిన పడకూడదంటే.. సరైన ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని కూడా అనుసరించాలి.