Rose Flowers: గులాబీ మొక్కకు అధికంగా పువ్వులు పూయాలా? ఈ చిన్న పని చేయండి చాలు
గులాబీ మొక్క అంటే ఎంతో మందికి ఇష్టం. బాల్కనీలో ఎక్కువగా కనిపించేది గులాబీ మొక్కలే. అయితే గులాబీ మొక్క పువ్వు పూయకపోతే చూసేందుకు ఏమాత్రం అందం ఉండదు. చిన్న ఉపాయంతో గులాబీ మొక్కలు విరిసేలా చేసుకోవచ్చు.

అందమైన గులాబీ మొక్క
గులాబీ పువ్వు ఏ మనిషి మనసునైనా ఇట్టే దోచేస్తుంది. బాల్కనీలో గులాబీ మొక్కలను పెంచే వారి సంఖ్య కూడా ఎక్కువే. కానీ కొన్నిసార్లు గులాబీ మొక్కకు పువ్వులు అధికంగా పూయవు. మొక్క ఉందని చెప్పుకోవడం తప్ప పూత మాత్రం ఉండదు. గులాబీ మొక్కలకు పువ్వులు అధికంగా పూయాలంటే మీరు చిన్న పని చేస్తే సరిపోతుంది.
ఇదే గులాబీల టైమ్
సెప్టెంబర్ నెలలోనే అధికంగా గులాబీ పువ్వులు వికసిస్తాయి. అందుకే బయట మార్కెట్లో కూడా గులాబీ పువ్వులు ఎక్కువగా ఇప్పుడే కనిపిస్తాయి. మీ ఇంట్లో గులాబీ మొక్క ఉంటే దానికి అధికంగా పువ్వులు పూసేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.
ఈ చిన్న పని చేయండి
గులాబీ మొక్క ఏపుగా పెరగాలన్నా, పువ్వులు పూయాలన్నా దాన్ని అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. అది నిలువుగా పెరిగే కన్నా గుబురుగా పొదలాగా పెరిగితే మంచిది. ఇలా కత్తిరించడం వల్ల మొక్కకు కొత్త ఆకులు, కొమ్మలు వస్తాయి. ఎప్పుడు అయితే కొమ్మలు వచ్చాయో పువ్వులు కూడా పూయడం మొదలుపెడతాయి.
కత్తిరించడం వల్ల లాభాలు
చాలామంది మొక్కను గులాబీ మొక్కను కత్తిరించడం వంటి పనులు చేయరు. అది పచ్చగా ఎదుగుతుంది కదా అని వదిలేస్తారు. పువ్వులు పూయాలంటే మాత్రం మీరు కచ్చితంగా గులాబీ మొక్కను కట్ చేస్తూ ఉండాలి. కొత్త కొమ్మలు వచ్చేలా చూడాలి. ఎప్పుడైతే కొత్త కొమ్మలు వస్తాయో.. కొత్త ఆకులు వికసిస్తాయో అప్పుడే మొగ్గ తొడిగి పువ్వులు వస్తాయి. కాబట్టి ఈ చిన్న పని చేయడం ద్వారా మీరు గులాబీ పువ్వులు అధికంగా పూసేలా చేయవచ్చు. ఇది చాలా సింపుల్ పని. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం ఈ నెలలోనే గులాబీ పువ్వులు ఎక్కువగా కాస్తాయి. కాబట్టి ఈ రోజే గులాబీ మొక్క కొమ్మలను కట్ చేయండి.