రాత్రి పడుకునే ముందు పాదాలను కడగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడగడం వల్ల హాయిగా నిద్రపట్టడంతో పాటుగా కీళ్ల నొప్పుల వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.

అలసిసొలసిన శరీరానికి నిద్ర చాలా అవసరం. నిద్రతోనే శరీరం తిరిగి శక్తివంతంగా, ఉత్సాహంగా మారుతుంది. లేదంటే పొద్దున్నే బద్దకంగా, శక్తిహీనంగా మారిపోతారు. ఏ పనిచేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే రోజుకు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. అయితే పొద్దంతా శరీరం అలిసేవిధంగా పనిచేయడం వల్ల కొందరు రాత్రుల్లు నిద్ర పోలేకపోతున్నారు. ఇలాంటి వారు నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. అందుకే నిద్రరావడానికి సహజ పద్దతులను ఉపయోగించాలి. రాత్రి పడుకునే ముందు పాదాలను బాగా కడగడం వల్ల బాగా నిద్రపట్టడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రీఫ్రెష్ గా ఉంటారు..
పడుకునే ముందు గోరువెచ్చని లేదా నార్మల్ వాటర్ తో పాదాలను శుభ్రంగా కడగడం వల్ల రాత్రి హాయిగా నిద్రపడుతుంది. అలాగే మరుసటి రోజు ఉదయం మీరు రీఫ్రెష్ గా కూడా కనిపిస్తారు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి..
మన శరీర బరువంతా పాదాలపై ఉంటుంది. దీంతో పాదాలు తిమ్మిరి పట్టడం లేదా కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే రాత్రి పడుకునే ముందు పాదాలను కడిగితే కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పాదాల వాసన పోతుంది..
సాక్స్ లు, టైట్ గా ఉండే షూస్ ను వేసుకోవడం వల్ల పాదాలలో చెమట విపరీతంగా పడుతుంది. దీంతో పాదాల నుంచి చెడు వాసన వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మారు ప్రతిరోజూ పడుకునే ముందు పాదాలను శుభ్రం చేయండి. దీంతో మీ పాదాల నుంచి వాసన మటుమాయం అవుతుంది.
శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచుతుంది..
పొద్దంతా మీ పాదాలను భూమిని తాకుతూనే ఉంటాయి. దీంతో అవి చాలా వేడిగా అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో పాదాలను నార్మల్ వాటర్ తో బాగా కడిగితే పాదాలు తిరిగి చల్లగా మారుతాయి. దీంతో మీ శరీర ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ గానే ఉంటాయి. ఇది మీకు మంచి నిద్రకు సహాయపడుతుంది.
అలసట, ఒత్తిడి మటుమాయం అవుతుంది..
రోజంతా నడవడం మీరు అలసిపోతారు. అయితే సాయంత్రం వేళ పాదాలను శుభ్రంగా కడగడం వల్ల ఒత్తిడి, అలసట మటుమాయం అవుతుంది. అలాగే పాదాలకు ఉన్న దుమ్ము, ధూళి కూడా వదిలిపోయి పాదాల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.