కాఫీని రోజుకు ఇన్ని సార్లు మాత్రమే తాగాలి.. లేదంటే మీ పని మటాషే..!
పొద్దున్న కాఫీ చుక్క గొంతును తడపనిదే ఏ పనిచేయని వారు చాలా మందే ఉన్నారు. కాఫీ తాగడం వల్ల బాడీ ఎనర్జిటిక్ గా మారుతుంది. అలా అని కప్పులకు కప్పులు కాఫీని లాగించేస్తే మాత్రం ఎన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చున్నట్టే అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీ కంటే కాఫీని తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వాస్తవానికి కప్పు కాఫీ తాగడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది. అందుకే చాలా మంది కాఫీ తాగనిదే ఏ పనిచేయరు. ఇక ఆఫీసుల్లో పనిచేసేవారైతే గంట గంటలకు కాఫీలను తాగమన్నా తాగుతుంటారు. కాఫీ తాగితే మైండ్ ఫ్రీ అవుతుంది. ప్రస్తుతం కాఫీకి మంచి డిమాండ్ ఉంది. కొన్ని సర్వేల ప్రకారం.. ఫ్యూచర్ లో ప్రపంచ వ్యాప్తంగా కాఫీకి ఎక్కడలేని డిమాండ్ పెరగుతుందట.
కాఫీ తాగడం వల్ల ఎనర్జిటిక్ గా ఉన్నప్పటికీ పలు పరిశోధనలు దీనిపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. కాఫీ తాగితే హార్ట్ హెల్త్ బాగున్నా.. ఇందులో ఉండే కెఫిన్ వయసును పెంచుతుందని పరిశోధనలో వెళ్లడైంది. అయితే రోజుకు ఎన్ని కప్పుల కాఫీని తాగితే హెల్త్ కు ఎటువంటి ప్రమాదం ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ ఎంత ఇష్టమున్నా దానిని మోతాదులోనే తాగాలని Hong Kong లోని Mattilta International హాస్పిటల్ కు చెందిన డైటీషియన్ కరెన్ చోంగ్ అంటున్నారు. కాఫీని తాగాలనుకునే వారు రోజుకు రెండు మూడు సార్లు మాత్రమే తాగాలని చెబుతున్నారు. ఇంతకు మించి తాగితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
మీరు రోజుకు మూడు కప్పుల కాఫీని తాగినట్టేతై మీ శరీరంలోకి 200 మి.గ్రా కెఫిన్ వెళుతుంది. మీ బాడీలోకి 400 మి. గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ వెలితే మీరు అనారోగ్యం బారిన పడతారని కరెన్ చోంగ్ అంటున్నారు.
coffee
కాఫీలో ఉండే కెఫిన్ Heart rate ను పెంచుతుంది. అంతేకాదు ఇది హృదయనాళ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే కాఫీని పెద్దలకు, పిల్లలకు అస్సలు ఇవ్వకూడదని చెబుతున్నారు.
అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా కాఫీని ఎక్కువగా తాగకూడదు. వీరు రోజుకు ఒకట్రెండు కప్పుల కంటే ఎక్కువ కప్పుల కాఫీని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక అల్సర్ సమస్యతో బాధపడేవారు కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాఫీలో ఉండే కెఫిన్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్య ను కలిగిస్తుంది.
ఎముకలు బలహీనంగా ఉండేవారు కాఫీకి దూరంగా ఉండటమే బెటర్. కాఫీని మోతాదుకు మించి తాగితే.. ఎముకలు బలహీనపడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పరిశోధన ప్రకారం.. మోతాదుకు మించి కాఫీని తాగితే మన ఒంట్లో కాల్షియం లెవెల్స్ తగ్గుతాయని వెల్లడైంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.