ప్రతి విషయంలో రిజెక్ట్ అవుతున్నారా? దానికి కారణాలు ఇవే..!
కొంతమంది ఏ పనిచేసినా సస్కెస్ అవరు. దానికి తోడు ప్రతిదాంట్లో రిజెక్ట్ అవుతుంటారు. ఇది వారిని నిరుత్సాహపరచడమే కాదు.. మానసికంగా బలహీనుల్ని కూడా చేస్తుంది.

కొంతమంది తమ జీవితంలో జాబ్ పరంగా కానీ.. రిలేషన్ షిప్స్ పరంగా.. అన్ని కోణాల్లో తిరస్కరణకు గురవుతూనే ఉంటారు. ఇది అందరి జీవితాల్లో ఉండదు. మంచే జరుగుతుందని ఊహించినా.. వీరి ప్రతి పని రిజెక్ట్ బాటే పడుతుంది. కానీ ఇదెంతో భయంకరంగా ఉంటుంది. మనసు నిండా నిరుత్సాహం నిండిపోతుంది. భవిష్యత్తు మీద ఇది ఆశలు కోల్పోయేలా చేస్తుంది. నేను దీన్ని చేయలేను.. ఏదీ సాధించలేను అనే భావాలను పుట్టిస్తుంది. అయితే పదే పదే తిరస్కరించబడటానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్ననాటి గాయం..
చాలా మంది బాల్యంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా, కోపం, చిరాకు, చేదు అనుభావాలు వారి మనసులో అలాగే నాటుకుపోతాయి. ఇవి భావోద్వేగపరంగా లేదా శరీరకంగా పిల్లల్ని బాధపెట్టే తల్లిదుండ్రులు ఉండేవారు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి వారు సంబంధాలను నమ్మరు. ముఖ్యంగా రిలేషన్ షిప్ లోనే ఉండకూడదని భావిస్తారు. గతంలో మీకు జరిగిన గాయలే వారిని ఇలా తయారుచేస్తాయి.
తక్కువ ఆత్మగౌరవం
ఆత్మగౌరవం తక్కువగా ఉంటే కూడా మీరు ఎల్లవేళలా అందరిచే తిరస్కరింపబడొచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే మీపై మీకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటేనే మీరు ఉన్నత స్థానాన్ని చేరుకోలేరు. అందులోనూ ఇలాంటి వారిని ఇతరులు ఇంకా కిందికి లాగడానికే చూస్తారు. మీకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ప్రతికూల ఆలోచనలు
చిన్నప్పటి నుంచి మీ మనస్సులో ప్రతికూల విషయాలు నాటుకుపోతే సంబంధాల్లో, కెరీర్ పరంగా విజయాలను అందుకోలేరు. ఇవి వాటీపై సానుకూల పరిస్థితులను తొలగిస్తాయి. మనస్సులో ప్రతికూల ఆలోచను ఉంటే మీకు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. మీ పట్ల వారికి దయ కూడా ఉందడు. దీంతో మీర ఎల్లప్పుడూ తిరస్కరణకు గురవుతారు.
వ్యక్తిత్వ రుగ్మత
Borderline personality disorders లేదా childhood abandonment వంటి ఇతర సమస్యల వల్ల కూడా మీరు తరచుగా రిజెక్ట్ అవుతుంటారు. ఈ రుగ్మతల గురించి ఇతరకు అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల ఇతరులతో మీరు ఫ్రీగా ఉండలేరు. ముఖ్యంగా మీ ప్రవర్తణను ఇతరులు విచిత్రంగా చూసే అవకాశం ఉంది. అంటే వారు మిమ్మల్ని వాళ్ల లాగా భావించరు. దీనివల్ల కూడా రిజెక్ట్ అవుతారు.