Health Tips: వీటి వల్లే దంతాలు పసుపు పచ్చగా మారుతాయి.. జాగ్రత్త..
Health Tips: మీరెంత అందంగా ఉన్నారన్నది ముఖ్యం కాదు. మీ దంతాలెంత తెల్లగా ఉన్నాయో అది ముఖ్యం. ఎందుకంటే ముత్యాల్లా మెరిసిపోయే దంతాలే మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు దంతాలను పసుపురంగులోకి మారేలా చేస్తాయి. అవేంటంటే.

Health Tips: మన ఆరోగ్యమే కాదు.. దంతాల ఆరోగ్యం కూడా బాగుండాలి. ఎందుకంటే మీరెంత అందంగా ఉన్నా.. మీ దంతాలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే దంతాలు పచ్చగా ఉండే వారు నలుగురిలో నవ్వడానికి గానీ, మాట్లాడటానికి గానీ ఇబ్బందిపడుతుంటారు.
ఇక పసుపు పచ్చ పళ్లను వదిలించుకోవడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయినా అవి పోకపోతే .. డాక్టర్లను సంప్రదిస్తుంటారు. వీరు కెమికల్స్ బ్లీచింగ్స్ తో దంతాలను తెల్లగా చేస్తారు. ఈ పద్దతి దంతాల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు.
అయితే దంతాలు అలా మారడానికి కారణం ఏంటో తెలుసుకుంటే.. దంతాలు అలా మారడాన్ని నివారించొచ్చు. ఇంతకీ ఎలాంటి ఆహారాలు దంతాలను పసుపు పచ్చగా మారుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ కాపీ (Black coffee).. బ్లాక్ కాఫీని తాగడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలున్నాయని తాగుతుంటారు. కానీ బ్లాక్ టీ వల్ల ప్రయోజనాలే కాదు.. దుష్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది దంతాలను పసుపు రంగులోకి మార్చుతుంది. అందుకే బ్లాక్ కాఫీని మోతాదులోనే తాగండి.
=
టీ.. హా టీ తాగితే కూడా పళ్లు పచ్చగా మారుతాయా.. అని ఆశ్ఛర్యపోయే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది నిజం.. క్రమం తప్పకుండా టీ తాగేవారి దంతాలు పసుపు పచ్చరంగులోకి మారడం పక్కాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ వైన్.. వైన్ అంటే ఇష్టమా.. అయితే వెంటనే ఈ అలవాటును మానుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రెడ్ వైన్ వల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయి. అంతేకాదు పంటికి పంటికి మధ్యన నలుపు కూడా పేరుకుపోతుంది.
కోలా పానీయాలు.. డైట్ సోడా, డార్క్ సోడా, కూల్ డ్రింక్స్ ను ఇష్టంగా తాగే వారి సంఖ్య బాగానే ఉంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు దంతాల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ముఖ్యంగా వీటిని విచ్చలవిడిగా తాగడం వల్ల పళ్లు పచ్చగా మారుతాయి.
పొగాకు.. ఇది ప్రాణాంతకం అని అందరికీ తెలుసు. అయినా దీన్నిఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. దీనివల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇది ఉపయోగించడం వల్ల పళ్లపై మరకలు ఏర్పడతాయి. అలాగే పెదవులపై కూడా మరకలు ఏర్పడతాయి. సిగరేట్ కాల్చేవారి దంతాలపై మరకలు, దంతాలు ఎల్లో కలర్ లోకి మారుతాయి.