MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Two Headed Snakes : నిజంగానే రెండుతలల పాములు ఉంటాయా..? ఇవి కోట్లు విలువ చేస్తాయా..?

Two Headed Snakes : నిజంగానే రెండుతలల పాములు ఉంటాయా..? ఇవి కోట్లు విలువ చేస్తాయా..?

తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో తాజాగా అటవీ శాఖ అధికారులు  'రెండు తలల పాము' (రెడ్ సాండ్ బోవా)ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మరి నిజంగానే రెండు తలల పాము ఉంటుందా..? అది కోట్ల విలువ చేస్తుందా…?

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 14 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండు తలల పామును కాపాడిన ఫారెస్ట్ అధికారులు..
Image Credit : Asianet News

రెండు తలల పామును కాపాడిన ఫారెస్ట్ అధికారులు..

Snakes : తాజాగాకర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని బీదర్‌ జిల్లాలో రెండుతలల పామును అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇలా వన్యప్రాణుల అక్రమ రవాణా చేస్తున్న ఓ పెద్ద ముఠా పట్టుబడింది. అయితే ఈ రెండు తలల పాము కోట్లాది రూపాయల విలువ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది… అందుకే ఈ పామును స్మగ్లింగ్ చేస్తున్నారట. ఇంతకూ రెండుతలల పాము నిజంగాపే ఉంటుందా..? అది ఇంత ధర పలుకుతుందా..? అనే డౌట్ చాలామందిలో ఉంది. దీనిగురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 నిజంగానే రెండు తలల పాములు ఉంటాయా?
Image Credit : stockPhoto

నిజంగానే రెండు తలల పాములు ఉంటాయా?

అవును... రెండు తలల పాములు నిజంగానే ఉంటాయని సైన్స్ కూడా చెబుతోంది. ఇది ప్రకృతి సిద్ధమైన వింత కాదు, ఒక జన్యుపరమైన లోపం. దీనిని శాస్త్రీయంగా "బైసెఫాలీ" (Bicephaly) అని పిలుస్తారు. కవలలు పుట్టే క్రమంలో పిండం సరిగ్గా విడిపోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇలాంటి పాములు ఎక్కువ కాలం బతకలేవు. ఎందుకంటే రెండు తలలు వేర్వేరు దిశల్లో వెళ్లడానికి ప్రయత్నిస్తాయి, దీనివల్ల శత్రువుల నుండి తప్పించుకోవడం వాటికి కష్టమవుతుంది.

రెడ్ శాండ్ బోవా (Red Sand Boa) 

మన దేశంలో "రెండు తలల పాము" అని పిలిచే పాము నిజానికి రెడ్ శాండ్ బోవా. దీనికి రెండు తలలు ఉండవు. దీని తోక కూడా తల లాగే మొద్దుగా ఉండటం వల్ల, శత్రువులను తప్పుదోవ పట్టించడానికి ఇది తోకను కూడా తలలాగే ఆడిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అంటే దీని తోక కూడా అచ్చం తలలాగే ఉంటుంది.. అందుకే దీన్ని రెండు తలల పాము అంటారు. 

Related Articles

Related image1
Snakes : హైదరాబాద్ లో పాములే పాములు.. ఏకంగా 55,467..!
Related image2
Snake Behavior: పాములు పగబట్టడానికి కారణమిదే..
35
రెండుతలల పాము కోట్ల విలువ ఉంటుందా..?
Image Credit : Asianet News

రెండుతలల పాము కోట్ల విలువ ఉంటుందా..?

అయితే ఈ పాములు కోట్లు విలువ చేస్తాయని అనడం తప్పుడు ప్రచారం. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి కోట్లు పలుకుతాయని, వీటిలో అద్భుత శక్తులు ఉంటాయని, వీటితో మందులు తయారు చేస్తారని నమ్మించి స్మగ్లర్లు అమాయకులను మోసం చేస్తారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వీటిని పట్టుకోవడం, అమ్మడం నేరం. శాస్త్రీయంగా వీటికి ఎటువంటి అతీంద్రియ శక్తులు లేవు.

45
మూఢనమ్మకాలే ఈ పాములకు శాపం..
Image Credit : Asianet News

మూఢనమ్మకాలే ఈ పాములకు శాపం..

రెండు తలల పాము లేదా మన్ను తినే పామును ఇంట్లో ఉంచుకుంటే లేదా పూజలు చేస్తే సంపద పెరుగుతుందనే అపోహ ప్రజల్లో ఉంది. దీన్నే స్మగ్లర్లు అవకాశంగా తీసుకుని అడవుల నుంచి వీటిని పట్టుకొచ్చి కోట్లకు అమ్ముతున్నారు. కానీ వన్యప్రాణులను పట్టుకోవడం, అమ్మడం చట్టవిరుద్ధం, కఠిన శిక్షార్హమైన నేరం. బీదర్ అటవీ శాఖ సరైన సమయంలో జరిపిన ఈ ఆపరేషన్‌ను ప్రజలు ప్రశంసిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని శాఖ భరోసా ఇచ్చింది.

55
చిక్కమగళూరులోనూ రెండు తలల పాము రక్షణ..
Image Credit : Asianet News

చిక్కమగళూరులోనూ రెండు తలల పాము రక్షణ..

ఇటీవల చిక్కమగళూరులో కూడా రెండు తలల పామును అమ్మడానికి ప్రయత్నించిన ఐదుగురిని అటవీ శాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. 1 కేజీ 400 గ్రాముల బరువున్న భారీ పామును అమ్ముతుండగా ఫారెస్ట్ మొబైల్ స్క్వాడ్ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు, ఇద్దరు తుమకూరు, ఒకరు శివమొగ్గకు చెందిన వారు ఉన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఆ రెండు తలల (మన్ను తినే) పామును అప్పుడు రక్షించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
Recommended image2
Washing Machine: మీ వాషింగ్ మెషీన్లో ఉన్న ఈ సీక్రెట్ ఫీచర్లు తెలుసా? సులువుగా మరకలు వదిలేస్తాయి
Recommended image3
Life After 40: 40 దాటిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
Related Stories
Recommended image1
Snakes : హైదరాబాద్ లో పాములే పాములు.. ఏకంగా 55,467..!
Recommended image2
Snake Behavior: పాములు పగబట్టడానికి కారణమిదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved