మీ టెర్రస్ గార్డెన్‌లో సువాసనలు వెదజల్లే తెల్ల పూల మొక్కలు పెంచాలనుకుంటున్నారా..? అయితే ఎంతో అందంగా ఉండి, మనసుకు ప్రశాంతతను ఇచ్చే 10 పూల మొక్కల గురించి తెలుసుకోండి.
రజనీగంధ పొడవాటి కాడలు, దాని మనోహరమైన సువాసన రాత్రిపూట కూడా టెర్రస్ గార్డెన్‌ను గుబాళింపజేస్తాయి. తక్కువ స్థలంలో సులభంగా పెరిగే ఈ మొక్క అందానికి, అలంకరణకు, సువాసనకు స్పెషల్.
గంధరాజ్ పువ్వులు వాటి ఘాటైన, ఫ్రెష్ సువాసనకు చాలా ఫేమస్. టెర్రస్ గార్డెన్‌లో ఈ మొక్క పచ్చదనంతో పాటు ఓ రాయల్ ఫీల్‌ను ఇస్తుంది. సాయంత్రం వేళల్లో వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంది.
రాత్ కీ రాణి సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. రాత్రి అవ్వగానే మీ టెర్రస్ మొత్తాన్ని సువాసనతో నింపేస్తుంది. టెర్రస్ గార్డెన్ కోసం చాలా పాపులర్ అయిన సువాసన పువ్వులలో ఒకటి.
తెల్ల గులాబీలు చూడటానికి అందంగా ఉండటమే కాదు, వాటి సువాసన టెర్రస్ గార్డెన్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ పువ్వులు ఇంటి అలంకరణతో పాటు పాజిటివిటీని, ప్రశాంతతను తెస్తాయి.
పారిజాతం చిన్న చిన్న తెలుపు-నారింజ పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. దీని మధురమైన సువాసన టెర్రస్ గార్డెన్‌ను సహజమైన ప్రశాంతతతో నింపేస్తుంది.
మధుకామిని చిన్న తెల్లని పువ్వుల గుత్తులు, వాటి నుండి వెలువడే సువాసన ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ మొక్క వేగంగా పెరుగుతుంది.
మల్లె పువ్వుల సువాసన ఎవరికి నచ్చదు చెప్పండి..? టెర్రస్ గార్డెన్‌లో ఈ మొక్క తక్కువ స్థలంలో సులభంగా పెరుగుతుంది. వేసవి సాయంత్రాలను మనోహరమైన సువాసనతో నింపేస్తుంది.
వైట్ ఆస్టర్ సున్నితమైన పువ్వులు.. టెర్రస్ గార్డెన్‌కు ఆకర్షణీయమైన, ప్రశాంతమైన లుక్‌ను ఇస్తాయి. దీని తేలికపాటి సువాసన, ఏడాది పొడవునా పూసే ఈ పువ్వులు అలంకరణకు కూడా చాలా బాగుంటాయి.
వైట్ డయాంథస్ అందమైన పువ్వులు వాటి తేలికపాటి సువాసనకు ప్రసిద్ధి. టెర్రస్ గార్డెన్‌లో ఈ మొక్క రంగు, సువాసన రెండింటినీ అందిస్తుంది. దీనివల్ల మీ టెర్రస్ అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.
వైట్ ఫ్లాక్స్ సువాసనగల పువ్వులు టెర్రస్ గార్డెన్ అందాన్ని పెంచుతాయి. దీని మధురమైన సువాసన సీతాకోకచిలుకలను కూడా ఆకర్షిస్తుంది. చిన్న గార్డెన్‌ను సహజమైన అందంతో నింపేస్తుంది.