MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Snake Behavior: పాములు పగబట్టడానికి కారణమిదే..

Snake Behavior: పాములు పగబట్టడానికి కారణమిదే..

Snake Behavior: ఒకే పాము పదేపదే మన ఇంటిముందో, ఇంకెక్కడైనా కనిపిస్తే ఏదో మహిమ అని లేదా పగ పట్టిందనో భయపడతారు. పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోస్తారు. ఆందోళన చెందుతారు.  కానీ దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : May 13 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాములు పగబడతాయా? వాస్తవమేంటీ?
Image Credit : getty, twitter

పాములు పగబడతాయా? వాస్తవమేంటీ?

పాములు పగ పడతాయని మనం వింటుంటాం కానీ, నిజానికి వాటికి ఉన్న అద్భుతమైన 'నావిగేషన్ పవర్' వల్లే అవి ఒకే ప్రదేశానికి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. తన చోట నుంచి ఆహారం కోసం ఎంత దూరం వెళ్లినా, అవి పాత చోటును మర్చిపోవు. అందుకే తిరిగి పాత చోటుకే చేరుకోగలవు. ముఖ్యంగా మీ పెరట్లో ఎలుకలు, కప్పలు దొరికినా లేదా అది సురక్షితమైన ఆవాసమని అవి భావించినా, తమకున్న నావిగేషన్ సెన్స్‌తో అక్కడికి వచ్చేస్తాయి. అందుకే ఒకే పాము మీకు పదేపదే దర్శనమిస్తుంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మళ్లీ మళ్లీ ఆకర్షించే ఒకే ప్రదేశం
Image Credit : Asianet News

మళ్లీ మళ్లీ ఆకర్షించే ఒకే ప్రదేశం

ఎండాకాలంలో చల్లదనం కోసం, వానాకాలంలో ఆవాసం కోసం పాములు బయటకు రావడం సహజం. అయితే, ఒకసారి తరిమేసినా అదే పాము మళ్లీ రావడం వెనుక ఎలాంటి మాయా మహిమలు లేవు. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వన్యప్రాణి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాములకు ఉండే అద్భుతమైన జ్ఞాపకశక్తి, పాములు వెళ్లే దారిలో వదిలే 'ఫెరోమోన్' అనే రసాయన వాసన వాటికి గూగుల్ మ్యాప్స్‌లా పనిచేస్తాయి. అందుకే అవి ఒకసారి చూసిన సురక్షితమైన ప్రదేశానికి మళ్లీ మళ్లీ చేరుకుంటాయి.

Related Articles

Related image1
Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?
Related image2
Snakes: స‌మ్మ‌ర్‌లో ఇళ్ల‌లోకి పాములు ఎందుకొస్తాయి.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా
35
పాత స్థలాలతో ప్రత్యేక అనుబంధం
Image Credit : Asianet News

పాత స్థలాలతో ప్రత్యేక అనుబంధం

పాములకు ఒక చోట ఆహారం, రక్షణ దొరికితే ఆ ప్రాంతాన్ని గుర్తుంచుకుంటాయి. దీన్నే 'ఫిడిలిటీ' అంటారు. ఈ స్వభావం వల్లే అవి తమ పాత ఆవాసాలకే పదేపదే వస్తుంటాయి తప్ప, అవి పగ పట్టవు. మీరు వాటిని తరిమేసినా, తమకున్న నావిగేషన్ సెన్స్‌తో మళ్లీ అదే సురక్షిత ప్రాంతానికి చేరుకుంటాయి.

45
నాలుకతో వాసన పసిగట్టగలవు
Image Credit : Getty

నాలుకతో వాసన పసిగట్టగలవు

పాములకు మనలా ముక్కుతో కాకుండా, నాలుకతో వాసన పసిగట్టగలవు. గాలిలో, నేలపై ఉండే రసాయన వాసనను గుర్తించడానికి అవి పదేపదే నాలుకను బయటకు తీస్తుంటాయి. పాములు ప్రయాణించే దారిలో 'ఫెరోమోన్లు' (Pheromones) అనే రసాయనాలను వదులుతాయి. ఈ వాసనను అవి గుర్తిస్తాయి. ఒకసారి మీ ఇంటి పరిసరాల్లో ఆహారం దొరికితే, ఈ ఫెరోమోన్ల ఆధారంగా అవి ఎంత దూరమెళ్లినా మళ్లీ పాత చోటుకే కచ్చితంగా చేరుకోగలవు.

55
ఆహారం కోసం పదే పదే వస్తాయి
Image Credit : Asianet News

ఆహారం కోసం పదే పదే వస్తాయి

ఎలుకలు, కప్పలు సులభంగా దొరికే చోట పాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటి చుట్టూ చెత్త, పడేసిన ధాన్యం ఎలుకలను ఆకర్షిస్తాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. ఆహారం దొరుకుతుంటే, ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడవు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jealous: మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? మీరు చేయాల్సింది ఇదే
Recommended image2
Kitchen Hack: గిన్నెలు తోమే స్పాంజ్‌ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలో తెలుసా?
Recommended image3
Mixer Grinder: మిక్సీని 3 నిమిషాల కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?
Recommended image2
Snakes: స‌మ్మ‌ర్‌లో ఇళ్ల‌లోకి పాములు ఎందుకొస్తాయి.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved