MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • మధుమేహులు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట..

మధుమేహులు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట..

షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటైన్ చేయడమనేది కష్టంతో కూడుకున్న పని. డైలీ హెల్తీ డైట్ ను తీసుకుంటూ.. కొంత సేపు వర్కౌట్స్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 08 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వన్స్ ఈ మధుమేహం బారిన పడ్డారంటే లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఏవి పడితే అవి తినకూడదు. ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.  అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి.  లేకపోతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉదయం లేవగానే షుగర్ పేషెంట్లు కొన్ని పనులను చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నీళ్లను తాగాలి

ఉదయం లేవగానే గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మీ పేగులను కూడా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఇలా ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం తగ్గుతుంది. 
 

36
morning walking

morning walking

మార్నింగ్ వాక్

షుగర్ పేషెంట్లకు మార్నింగ్ వాక్ చాలా అవసరం. ఈ నడక వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మార్నింగ్ వాక్ గొప్ప వ్యాయామం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది శరీరం సక్రమంగా పనిచేసేలా చేయడమే కాదు ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.
 

46

బ్లడ్ షుగర్ టెస్ట్

షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం లేవగానే రక్తంలో చక్కెర స్థాయిలను టెస్ట్ చేసుకోవాలి. ఇందుకోసం మార్కెట్ లల్లో గ్లూకోమీటర్లు ఉంటాయి. దీని సాయంతో ఇంటివద్ద మీరే టెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. 
 

56

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తింటే మరికొందరు మాత్రం రకరకాల టిఫిన్స్ ను తింటుంటారు. ఇంకొందరు బరువు పెరుగుతామనో.. టైం లేకనో మొత్తానికే బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. నిజానికి బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం అస్సలు  మంచిది కాదు. ఉదయం పూట మీ ఆరోగ్యానికి మంచి చేసే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినండి. ఆయిలీ ఫుడ్స్ ను, తీపి పదార్థాలను అస్సలు తినకండి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. 

66

పాదాలను చూడండి

షుగర్ వ్యాధి  కూడా పాదాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే పాదాలను చూడండి. పాదాలు కానీ.. పాదాల గోర్ల రంగు గానీ మారినట్టైనా.. లేదా పాదాలపై ఏవైనా బొబ్బలు, గాయాలు గుర్తున్నా వెంటనే డాక్టర్ దగ్గరకు వెల్లడం మంచిది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Cleaning: పట్టు చీరలపై నూనె మరకలా? కేవలం ₹10లకే ఈజీగా తొలగించే చిట్కా
Recommended image2
Weight Loss Foods: బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా?
Recommended image3
Dosa Tips: ఇడ్లీ పిండిని ఇలా దోశె పిండిగా మార్చేయండి, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved