Leggings Reuse: పాత లెగ్గిన్స్ పారేస్తున్నారా? ఇంట్లో పనికొచ్చే ఈ వస్తువులు చేసేయండి..!
Leggings Reuse: ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అంటే.. కచ్చితంగా లెగ్గింగ్స్ వాడుతూనే ఉంటారు. మంచి కంఫర్ట్ తో పాటు ఏ డ్రెస్ కి అయినా సూటయ్యేలా ఉండే లెగ్గింగ్స్ పాడయ్యాయని పడేస్తున్నారా? ఇలా వాడేయండి.

పాత లెగ్గిన్స్ కి కొత్త లుక్...
మీ దగ్గర ఏ రంగు లెగ్గింగ్స్ అయినా పనికిరావు అనుకుంటే.. ఇక నుంచి పారేయకండి. కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే.. ఆ పనికిరాని లెగ్గింగ్స్ తోనే.. అద్భుతమైన పనికి వచ్చే వస్తువులను తయారు చేసుకోవచ్చు. క్యూట్ గా అదిరిపోయే టీషర్ట్ దగ్గర నుంచి..మీ జుట్టును అందంగా మార్చుకునే వరకు వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
జీన్స్, స్కర్ట్ మీదకు క్యూట్ షార్ట్ టాప్...
మీ దగ్గర ఏదైనా పాత లెగ్గిన్ ఉంటే.. దానిని కాళ్ల దగ్గర కట్ చేసేయాలి. తర్వాత.. కట్ చేసిన దగ్గర కొద్దిగా మడిచి కొట్టారంటే.. అందమైన క్రాప్ టాప్ తయారైపోతుంది. దానిని మీరు జీన్స్ లేదంటే స్కర్ట్ మీద వేసుకుంటే సరిపోతుంది. చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తారు. బయట కొన్న దానికంటే కూడా మీరు ఇలా తయారు చేసుకున్నది ఇంకా బాగుంటుంది.
మీ పొట్ట కవర్ చేసే షేప్ వేర్...
ఈ రోజుల్లో పొట్ట కనిపించకుండా.. సన్నగా కనిపించాలని చాలా మంది షేప్ వేర్స్ ధరిస్తూ ఉంటారు. అవి కొనాలంటే కాస్త ఖరీదు ఎక్కువే. కానీ.. దానిని మీరు పాత లెగ్గిన్ తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాని వల్ల మీరు చాలా సన్నగా కనిపిస్తారు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. దీని కోసం.. నడుము భాగాన్ని మీకు ఎంత అవసరమో.. అంత సైజులో కట్ చేసుకొని.. అంచులను కుట్టుకుంటే సరిపోతుంది.
సైకిల్ షార్ట్స్...
మీ పొడవాటి లెగ్గిన్ వేసుకోవడం నచ్చకపోతే..దానిని మోకాలి వరకు కట్ చేసేయండి. తర్వాత.. దానిని మడత పెట్టి కుడితే.. సైకిల్ షార్ట్స్ రెడీ. వీటిని స్కర్ట్స్ లాంటి వాటి కింద కూడా వేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ గా ఉంటాయి.
హీట్ లేకుండా హెయిర్ కర్ల్స్..
జుట్టు ఉంగరాలుగా తిరిగి ఉండటాన్ని చాలా మంది ఇష్టపడతారు. దాని కోసం.. ఖరీదైన హెయిర్ స్ట్రెయిట్నర్స్ వాడతారు. కానీ... వాటి వల్ల జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. మీ పాత లెగ్గిన్ ని.. ఇలా జుట్టుకు చుట్టి రాత్రంతా వదిలేస్తే.. ఉదయానికి.. అందంగా రింగులు తిరుగుతాయి. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ ఉండదు. జుట్టు మాత్రం అందంగా కనిపిస్తుంది.
ఇవి మాత్రమే కాదు.. మీరు వీటితో అందమైన హెయిర్ బ్యాండ్స్, చేతికి వేసుకునే గ్లౌజులు కూడా తయారు చేసుకోవచ్చు. సైకిల్ సీటు కవరుగా, పూలకుండీలకు కవర్లుగా కూడా వాడేయచ్చు. పనికిరావు అని పారేసే బదులు.. కాస్త ఓపికగా,క్రియేటివ్ గా ఆలోచిస్తే.. ఇలాంటివి బోలెడు తయారు చేయచ్చు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా.. ఈ చిన్న చిన్న ఐడియాలే.. మనకు చాలా రకాలుగా డబ్బులు కూడా ఆదా చేస్తాయి.

