స్త్రీల పిరుదుల సైజును బట్టి పురుషులు ఆకర్షితులవుతారా? అధ్యయనాలేమంటున్నాయంటే....
విశాలమైన నడుం ఉన్న స్త్రీలు.. పిరుదులు పెద్దగా ఉన్న స్త్రీలు అంటే పురుషులు ఇష్టపడతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? అసలు పురుషులు స్త్రీలలో ఎలాంటి ఒంపులుంటే ఇష్టపడతారు?
Relationship Goals
పిరుదులు పెద్దగా, నడుం విశాలంగా ఉండే స్త్రీలంటే పురుషులు పడి చచ్చిపోతారట. దీనికి సంబందించి అనేక కథనాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. అంతేకాదు. పెద్ద పిరుదులు ఉండడడం అందానికి కొలమానంగా కూడా చూస్తున్నారు. అందుకే చాలామంది సెలబ్రిటీలు తమ పిరుదులు పెద్దగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇది తమ భాగస్వామి దృష్టికి ఆకర్షంచడానికి, అందానికి ప్రమాణికంగా కొలవడానికి పనికివస్తుందని నమ్ముతారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది. పురుషులు నిజంగా పెద్ద పిరుదులు ఉంటే ఇష్టపడతారా?
Relationship Goals
శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధనలో ఇటీవల గమనించిన దాని ప్రకారం, పురుషులు నిజంగా పెద్ద పిరుదులకు ఆకర్షితులవుతున్నారని భావించినప్పటికీ, చక్కటి ఒంపులున్న శరీరసౌష్టవంలో ఇమిడిపోతేనే ఇష్టపడతారు. ఈ అధ్యయనంలో 17 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మంది పురుషులు పాల్గొన్నారు.
Relationship Goals
వీరికి వారి పక్కన ఏర్పాటు చేసిన స్త్రీ నీడ ఆధారంగా ఆమె ఆకర్షణీయతను ను రేట్ చేయమని అడిగారు. ఇందులోని ప్రతీ ఫొటో వివిధ కోణాలలో స్త్రీల సిలహౌట్ ను చూపిస్తూ.. వెన్నెముక వద్ద కాస్త మార్పులు ఉన్నాయి. అలా వెన్నెముక కింది భాగంలో 45 డిగ్రీల కోణంలో వక్రంగా ఉన్నప్పుడు మాత్రమే పురుషులు బాగా ఇష్టపడతారని తేలింది.
Relationship Goals
వివిధ బట్ ఆకారాల ద్వారా పరిశోధన
వెన్నెముక వక్రత 45 డిగ్రీలు లేదా దానికి దగ్గరగా ఉన్న స్త్రీలు వారి పిరుదుల పరిమాణంతో సంబంధం లేకుండా... దాదాపు 200 మంది పురుషులను ఆకర్షించారని పరిశోధకులు మరొక అధ్యయనంలో తేల్చారు. పురుషులు ఒక నిర్దిష్ట వెన్నెముక వక్రతను కలిగి ఉన్న మహిళలను ఇష్టపడతారని ఇది రుజువు చేసింది. అంతేకాని పిరుదుల ఆకారాన్ని బట్టి కాదు.
Image: Getty Images
జనాదరణ పొందిన నమ్మకాలు
వెన్నుపూస నిర్మాణంలో విశాలంగా, కాస్త ఒంపులు ఉన్న స్త్రీలు ఉన్న స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు తుంటిపై బరువును సమతుల్యం చేసుకోగలరనేది ఒక ప్రసిద్ధ నమ్మకం. ఇది గర్భధారణ సమయంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దీంతోపాటు వెన్నెముక గాయాలు తక్కువగా అవుతాయి. పిల్లలు పుట్టే సామర్థ్యం ఉన్న స్త్రీలతో ఉండేందుకు పురుషులు ఇష్టపడతారు.