ఈ సూప్ లు తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సే ఉండదు తెలుసా?
డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలని డాక్టర్లు చెప్తుంటారు. అయితే కొన్ని రకాల వెజిటేరియన్ సూప్ లు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతాయి.

డయాబెటీస్ రోగులు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన వాటినే తినాల్సి ఉంటుంది. ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు ఇవి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. బరువును కూడా పెంచుతాయి. అందుకే మధుమేహులకు నాన్ వెజ్ కంటే వెజ్ ఫుడ్ యే మంచిది. మధుమేహులు కొన్ని రకాల శాఖాహార సూప్ లు తాగితే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అవేంటంటే..
టొమాటో సూప్
టొమాటో సూప్ మధుమేహులకు చాలా మంచిది. దీనిని తయారుచేయడానికి టొమాటో సూప్, అర టీస్పూన్ ఎర్ర మిరియాలు, రుచిగా తగ్గ ఉప్పు, టీ స్పూన్ వెల్లుల్లిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ను వెలిగించి పాన్ పెట్టండి. అందులో ఒక కప్పు నీటిని పోసి వీటిలో అన్ని పదార్థాలను వేసి బాగా ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. దీనిని మరొక గిన్నెలోకి తీసుకుని మళ్లీ వేడి చేసి.. నల్ల ఉప్పును వేసి తీసుకోండి.
రెడ్ లెంటిల్ సూప్ (Red Lentil Soup)
షుగర్ పేషెంట్లకు రెడ్ లెంటిల్ సూప్ ప్రయోజకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీని కోసం నానబెట్టిన ఎర్ర పప్పు, క్యారెట్, ఉల్లిపాయలు, క్యాప్సికం లను తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక పాన్‌లో వేసి.. నీళ్లను పోసి 10 నిమిషాలు ఉడికించాలి. కావాలనుకుంటే వీటిలో అజ్వైన్ ఆకులను వేసుకోవచ్చు. దీనివల్ల సూప్ టేస్టీగా అవుతుంది. ఇది ఉడికిన తర్వాత బ్లెండ్ చేసి గిన్నెలో వేసి సర్వ్ చేసుకోవాలి.
mushroom soup
పుట్టగొడుగుల సూప్
మష్రూమ్ సూప్ లు తాగితే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనికోసం ఒక కప్పు పుట్టగొడుగులు, టీ స్పూన్ గోధుమ పిండి, అరకప్పు తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, టీ స్పూన్ ఆయిల్, అరకప్పు తరిగిన ఉల్లిపాయలు, రుచికి తగ్గ ఉప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిని తీసుకుని స్టవ్ పై పెట్టాలి. ఇందులో ఉల్లిపాయలు వేసి వేయించండి. దీనిలో అరకప్పు నీళ్లు పోసి మిగతా పదార్థాలన్నింటినీ వేసి వేయించండి. దీన్ని 6 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పాలలో వేసి బ్లెండ్ చేయండి. దీన్ని ఒక బాణలీలో వంటనూనె వేసి దానిలో ఈ మిశ్రమాన్ని వేసి సన్నని మంటమీద ఉడికించండి. అంతే ఇది రెడీ అయినట్టే..