MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మధుమేహులు గోధుమ రొట్టెలకు బదులుగా.. ఈ పిండితో చేసిన రొట్టెలు తిన్నా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో ఉంటాయి..

మధుమేహులు గోధుమ రొట్టెలకు బదులుగా.. ఈ పిండితో చేసిన రొట్టెలు తిన్నా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో ఉంటాయి..

మధుమేహులు గోధుమ పిండి రొట్టెలనే ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇదొక్కటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని నమ్ముతారు. నిజానికి డయాబెటీస్ రోగులకు కొన్ని రకాల పిండులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 23 2022, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య దారుణంగా పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతే వీళ్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా దీనివల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది. గుండెపోటు ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ షుగర్ వ్యాధి కొంత మందికి చెడు ఆహారాలు, లైఫ్ స్టైల్ వల్ల వస్తే, ఇంకొంత మందికి మాత్రం జన్యుపరంగా వస్తుంటుంది. షుగర్ పేషెంట్లు అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలనే ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే అన్నం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రొట్టె అయితే అలా కాదు. మధుమేహులు ఒక్క గోధుమ రొట్టెలనే కాదు.. వేరే పిండి తో చేసిన రొట్టెలు కూడా తినొచ్చు. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాధారణంగా.. మనలో చాలా మంది గోధుమ రొట్టెలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లైతే.. అన్నానికి కంటే ఈ రొట్టెలను ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అయితే తృణధాన్యాల పిండితో చేసిన రొట్టెలను కూడా మధుమేహులు తినొచ్చు. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహులు ఎలాంటి పిండితో చేసిన రొట్టెలను తినొచ్చో తెలుసుకుందాం పదండి. 

36

బార్లీ పిండి

మధుమేహులు ప్రతిరోజూ గోధుమ పిండిని తింటూ ఉంటారు. వీటిని తిన్నా పెద్దగా నష్టమేమీ జరగదు. కానీ వీటికి బదులుగా బార్లీ పిండిని కూడా తినొచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
 

46

రాగుల పిండి

రాగులను మధుమేహులు తప్పకుండా తినాల్సిన ఆహారం తెలుసా.. ఎందుకంటే వీటిలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ముఖ్యమైన ఖనిజాలు, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ పిండి కూడా చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి. 
 

56

మన పెద్దలు ఒక్కువగా జొన్న పిండితో చేసిన రొట్టెలనే ఎక్కువగా తినేవారు. అందుకే వాళ్లు అంత బలంగా ఉండేవారు.  ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్, మెగ్నీషియం కూడా ఈ పిండిలో ఉంటాయి. షుగర్ పేషెంట్లకు ఈ పిండితో చేసిన రొట్టెలు ప్రమయోజనకరంగా ఉంటాయి. ఈ పిండితో చేసిన రొట్టెలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. 

66

శెనగ పిండి

శెనగ పిండిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. అయితే మీరెప్పుడైనా శెనగపిండితో తయారుచేసిన రొట్టెలను తిన్నారా? ఈ రొట్టెలు షుగర్ పేషెంట్లకు ఔషదం లాంటిది తెలుసా.. ఎందుకంటే ఈ రొట్టెలు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 
           

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Green Tea: రోజూ ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది
Recommended image2
Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Recommended image3
Aquarium Design: ఈ అక్వేరియం డిజైన్లతో మీ ఇంటిని ప్యాలెస్ లా మార్చేయొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved