MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • షుగర్ పేషెంట్లు కిస్ మిస్ లను తినొచ్చా?

షుగర్ పేషెంట్లు కిస్ మిస్ లను తినొచ్చా?

కిస్ మిస్ లల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. తియ్యగా ఉండే వీటిని షుగర్ పేషెంట్లు తినొచ్చా? ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అంటూ ఎన్నో సందేహాలు వస్తుంటాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 06 2023, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎండు ద్రాక్షలను కిస్ మిస్ లు అనికూడా అంటారు. తియ్యగా, టేస్టీగా ఉండే వీటిని రకరకాల వంటల్లో వేస్తుంటారు. సలాడ్లు, స్వీట్లతో సహా వివిధ రకాల వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నిజానికి ఈ డ్రై ఫ్రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. డయాబెటిస్ పేషెంట్లు వీటిని తినడానికి వెనకాడుతుంటారు. కారణం ఇవి చాలా తియ్యగా ఉంటాయని. వీటిని తింటే ఎక్కుడ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయేమోనని.. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


డయాబెటిస్ పేషెంట్లు ఎండుద్రాక్షలు తినవచ్చా?

హెల్త్ లైన్ ప్రకారం.. షుగర్ పేషెంట్లు ఎండుద్రాక్షను మితంగా తిన్నంత కాలం ఎలాంటి సమస్యలు రావు. ఎండుద్రాక్ష అన్ని రకాల పండ్ల మాదిరిగా సహజ చక్కెరను, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అందుకే వీటిని కూడా కొద్ది మొత్తంలోనే తినాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కిస్ మిస్ లో సహజ చక్కెరతో పాటుగా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే ఎండుద్రాక్షలను ఎంచక్కా తినండి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకూడదంటే మితంగాననే తినాల్సి ఉంటుందని  ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

37


ఎండుద్రాక్ష ప్రయోజనాలు

పోషకాలు ఎక్కువగా ఉంటాయి

ఎండుద్రాక్షలు విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. వీటిలో ఇనుము కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఇనుము మన శరీరానికి ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి చాలా అవసరం. వీటిలో కాల్షియం, పొటాషియం, బోరాన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.
 

47

జీర్ణక్రియకు మంచిది

ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

57

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఫైబర్ ను ఎక్కువగా తినే వ్యక్తులు సులువుగా బరువు తగ్గుతారని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి కూడా. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎండుద్రాక్షలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

67

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఎండుద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. ఎండుద్రాక్షలను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 
 

77

ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచొచ్చు

ఎండుద్రాక్షల్లో బోరాన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. బోరాన్ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman : హనుమంతుడి నుండి ఈ 5 పాఠాలు నేర్చుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది
Recommended image2
Pressure Cooker: కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చేస్తే వాటర్ బయటకు రాదు
Recommended image3
Skin Allergies: గిల్టు నగలతో అలర్జీ వస్తుందా? ఈ టిప్ ట్రై చేేయండి..ఇంకెప్పుడూ ఆ సమస్యే ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved