MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇవి కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి.. జర జాగ్రత్త..

ఇవి కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి.. జర జాగ్రత్త..

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం, నిద్రలేమి, నిర్జలీకరణం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కొన్ని విషయాలు కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తాయన్న ముచ్చట మీకు తెలుసా?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 27 2022, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సాధారణ, రోజు రోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి. దీనిని నియంత్రణలో ఉంచుకోకపోతే.. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి వంటి ఎన్నోప్రాణాంతక రోగాలు వస్తాయి. మన రోజువారి అలవాట్లు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే.. 

28

కృత్రిమ స్వీటెనర్లు: కృత్రిమ స్వీటెనర్లు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. శాకరిన్, సుక్రోలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకోండి. 

38

నిద్రలేమి: మీకు తెలుసా..? కంటినిండా నిద్రలేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. అందుకే నిద్ర సరిపడినంతగా లేకపోతే.. మీ శరీరం ఇన్సులిన్ ను తక్కువగా ఉపయోగించుకుంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 
 

48
breakfast

breakfast

అల్పాహారాన్ని దాటవేయడం: చాలా మంది బరువు తగ్గాలనో లేకపోతే టైం లేకనో.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. నిజానికి బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తింటే మీరు హుషారుగా, ఎనర్జీటిక్ గా ఉంటారు. ఉదయం పూట ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని తినడం మంచిది. 

58

నిర్జలీకరణం: శరీరం డీహైడ్రేట్ అయితే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయంటే మీరు ఆశ్చర్యపోతారేమో.. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. శరీరంలో నీటి శాతం తగ్గితే.. రక్తంలో చక్కెర ఎక్కువ అవుతుంది. అందుకే నీటిని పుష్కలంగా తాగండి. అప్పుడే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 
 

68

శారీరక శ్రమ లేకపోవడం:  శారీరక శ్రమ చేయడం చాలా అవసరం. ఒక్క రోజు మిస్ కాకుండా శారీరక శ్రమ చేస్తేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే బ్లష్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. అందుకే రోజూ మిస్ కాకుండా వ్యాయామం చేయండి. అప్పుడే టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మీకు తెలుసా..? వ్యాయామం చేయడం వల్ల శరీరం ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. రక్తం నుంచి గ్లూకోజ్ ను తొలగించడానికి, శక్తి రూపంలో ఉపయోగించడానికి కణాలకు సహాయపడుతుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల మీరు బరువు పెరుగుతారు.

78

కెఫిన్: కాఫీ అలవాటు లేని వారు చాలా మందే ఉన్నారు. కానీ కాఫీలు మధుమేహులకు అంత మంచివి కావు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. 

88

చిగుళ్ల వ్యాధి:  చిగుళ్ల వ్యాధి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ సంక్లిష్టతలలో చిగుళ్ల వ్యాధి ఒకటి. కానీ అనారోగ్యకరమైన చిగుళ్ళు కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.

కార్టికోస్టెరాయిడ్స్, ఆస్తమా మందులు, జనన నియంత్రణ మాత్రలు, కొన్ని యాంటి డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయంటున్నారు నిపుణులు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!
Recommended image2
Rat Control Tips: ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసే బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image3
Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved