BeautyTips: మెడ మీద నలుపు ఎంతకీ పోవట్లేదా.. ఇది వాడితే మొండి నలుపు సైతం పరార్?
Beauty Tips: చాలామంది మొహం మీద చూపించే శ్రద్ధ మెడ మీద చూపించరు. పైగా అక్కడ క్లీన్ చేసుకోవటం కూడా కొంచెం ఇబ్బంది. అందుకే అక్కడ మురికి పేరుకుపోయి కొన్ని రోజులకి అసహ్యంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు వాడి చూడండి.

ముఖం అందంగా కనిపించడానికి అమ్మాయిలు రకరకాల ప్యాక్స్ వేసుకుంటారు. పార్లర్లలో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. కానీ మెడ దగ్గరికి వచ్చేసరికి కాస్త నిర్లక్ష్యం వహిస్తారు. అయితే ఎండలు, కాలుష్యం, హార్మోన్ల మార్పుల కారణంగా మెడ నల్లగా మారుతుంది. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత కూడా మెడ నల్లగా మారే అవకాశం ఉంటుంది.
దీనివల్ల మెడ నల్లగా అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే కొన్ని ప్యాక్స్ వేసుకుంటే ఎంతటి మొండి నలుపు అయినా పరార్ అవుతుంది. అవేంటో చూద్దాం. ముందుగా నారింజ తో ప్రారంభిద్దాం. నారింజ తొక్కలో చర్మాన్ని తెల్లగా చేసే గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
నారింజ తొక్కలోని యాంటీ ఆక్సిడెంట్స్ మెడ నల్లబడటానికి కారణం అయ్యే టైరోసిన్ సన్మానానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. నారింజ తొక్కల పొడిలో పాలు గాని ఆరెంజ్ జ్యూస్ గాని వేసి పేస్ట్ లాగా తయారుచేసి మెడకు అప్లై చేసి పది పదిహేను నిమిషాలు ఉంచండి.
తర్వాత గోరువెచ్చని నీటితో మెడని శుభ్రం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మెడ నలుపు తగ్గి సాధారణ రంగులోకి వస్తుంది. అలాగే ఓట్స్ కూడా నలుపుని తగ్గించడానికి, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది.
ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్ గ్రౌండ్ లో వేసి దానిలో కొద్దిగా టమాటా పేస్ట్ మిక్స్ చేయండి. ఓట్స్ పొడి, టమాట ప్యూరీ కలిపి పేస్ట్ లాగా చేసి మెడకి పట్టించండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మెడని కడిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్యాక్ ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి.
అలాగే కలబంద కూడా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జుని మెడకి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మెడని శుభ్రం చేసుకోండి. దీని వల్ల కూడా మెడ కాంతివంతంగా కనిపిస్తుంది.