కళ్లకింద బ్లాక్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటిని ఇలా దూరం చేయండి..
Dark circles under eyes: కళ్లకింద వచ్చే బ్లాక్ సర్కిల్స్ తో ఎంత అందంగా రెడీ అయినా.. ఫేస్ అంతగా బ్యూటీఫుల్ గా అనిపించదు. వీటిని ఎలా పోగొట్టాలా.. అంటూ చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు ఈ సింపుల్ చిట్కాలతో మీ కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను చిటికెలో దూరం చేయొచ్చు.
Dark circles under eyes: ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే కళ్లే ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందం అంటే ముఖం కాదు.. కళ్లేనంటారు చాలా మంది. అందుకే కళ్లపై ఎన్నో కవితలను రాస్తుంటారు రచయితలు. అందులోనూ కళ్ల అందం పై ఎన్నో సినిమా పాటలు కూడా వచ్చాయి. మానవ శరీరంలో అన్నింటికంటే కళ్లకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అలాంటిది కళ్లు అందంగా లేకపోతే ఎలా.. అందమైన కళ్లు, ఆకట్టుకునే కళ్ల కింద నల్లటి వలయాలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. చూడటానికి కూడా ఈ బ్లాక్ సర్కిల్స్ అంతగా మంచిగా అనిపించవు. మరి వాటిని ఎలా దూరం చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువగా నిద్రలేమి సమస్యతోనే వస్తాయి. దీనితో పాటుగా అధిక ఒత్తిడి, ఎలర్జీ, హార్మోన్మ హెచ్చు తగ్గులు, డీ హైడ్రేషన్ సమస్య వల్ల ఈ బ్లాక్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. వీటి వల్ల ఎంత అందమైన ముఖమైనా అందవిహీనంగానే కనిపిస్తుంది. వీటిని దూరం చేయడంలో కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ కూడా కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను దూరం చేస్తాయి. ఇందులో ఏదో ఒక నూనెను తీసుకుని చేతివేళ్లకు కాస్త అద్దుకుని కళ్లకింద పెట్టి కాసేపు మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే వీటి బాధ నుంచి తప్పించుకోవచ్చు.
వీటితో పాటుగా టమాట జ్యూస్ లేదా నిమ్మరసం కూడా బ్లాక్ సర్కిల్స్ ను దూరం చేస్తాయి. టమాట జ్యూస్ లో కాస్త నిమ్మరసం వేసి కళ్లకింద అప్లై చేసి ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసి 20 నిమిషాల తర్వాత నీట్ గా కడగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది. అలాగే బంగాళ దుంపను పేస్ట్ లా చేసి పెట్టినా.. లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టినా ఈ వలయాలు మటుమాయం అవుతాయి.
కీరదోసను రౌండ్ కోసి కళ్లపై పెట్టుకున్న చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే కీరదోస పేస్ట్ లో కాస్త నిమ్మరసం కలిపి కళ్లకింద అప్లై చేసినా ఈ వలయాలు దూరం అవుతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా బ్లాక్ సర్కిల్స్ దూరం అవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.