పురుషుల్లో ఎక్కువగా వచ్చే శృంగార సమస్యలు ఇవే.. తగ్గించుకోకుంటే మీ పనిఅంతే..!
నిజానికి చాలా మంది సెక్స్ గురించి మాట్లాడటానికి.. దానికి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ చెప్తే ఏమనుకుంటారోనని. కానీ ఇలాంటి విషయాలను ఇతరులతో చర్చించినప్పుడే ఆ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
వైవాహిక జీవితంలో సెక్స్ లైఫ్ చాలా కీలకం. ఎందుకంటే ఇది బాగుంటేనే మిగతా లైఫ్ అంతా బాగుంటుందని నిపుణులు అంటుంటారు. కానీ ప్రస్తుతం స్త్రీలతో పాటుగా, పురుషులు కూడా లైంగిక సమస్యలను ఫేస్ చేస్తున్నారు. వీటిని మాత్రం ఎవరికీ చెప్పలేక తమలో తామే నలిగిపోతున్నారని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. నిజానికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి ఇతరులతో చెప్పినప్పుడే సమస్య తగ్గిపోతుంది. లేదంటే మరింత పెద్దదిగా మారతాయి. ఇంతకీ పురుషులు ఎలాంటి లైంగిక సమస్యలతో బాధపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అంగస్తంభన లోపం
ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు అంగస్తంభన లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య రావడానికి.. మందును ఎక్కువగా తాగడం, స్మోకింగ్, హై బీపీ, కొన్ని రకాల మెడిసిన్స్, వాస్కులర్ వ్యాధి, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యల వస్తుంది.
శీఘ్ర స్ఖలనం
కొంతమంది పురుషులకు ..సెక్స్ లో పాల్గొన్న కొద్ది సేపటికే.. వీర్యం బయటకు వచ్చేస్తుంది. దీన్నే శీఘ్ర స్ఖలనం అంటారు. మానసిక ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్, వాపు, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.
సెక్స్ కోరికలు తగ్గడం
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో కూడా సెక్స్ పట్ల కోరికలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషుల్లో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. కొన్ని రకాల మందులు, హై బీపీ, డయాబెటీస్ వంటి సమస్యల వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. వీటివల్ల సెక్స్ పై కోరికలు తగ్గిపోతాయి.
వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది
ఉండాల్సిన వాటికంటే తక్కువగా వీర్యకణాలు తగ్గడాన్నే తక్కువ స్పెర్మ్ కౌంట్ అంటారు. వీర్యకణాలు తక్కువగా ఉండటం వల్ల గర్భందాల్చడం చాలా కష్టం. దీనివల్ల ఎంతో మంది పురుషులు వంధ్యత్వ సమస్యను ఫేస్ చేస్తున్నారు. స్మోకింగ్, హార్మోన్ల హెచ్చుతగ్గులు, గాయం, ఆల్కహాల్, లైంగికంగా సంక్రమించే రోగాలు, ఊబకాయం వంటి సమస్యల వల్ల సెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది.
రెట్రోగ్రేడ్ స్ఖలనం
రెట్రోగ్రేడ్ స్ఖలనం వల్ల స్పెర్మ్ పురుషాంగం గుండా బయటకు వెళ్లదు. కాగా ఇది మూత్రాశయంలోకి వెళ్లిపోతుంది. ఈ సమస్య ఎక్కువగా ప్రోస్టేట్ శస్త్రచికిత్స, నరాలు దెబ్బతిన్న వారిలోనే కనిపిస్తుంది.
ఒత్తిడి, ఆందోళన, అతి ఆలోచన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల వల్ల కూడా పురుషుల్లో లైంగిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి.
ఎలాంటి లైంగిక సమస్యలున్నా.. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఎలాంటి మొహమాటం లేకుండా డాక్టర్ కు అన్ని విషయాలు చెప్పండి. చికిత్స తీసుకుంటే మీ సెక్స్ లైఫ్ మెరుగుపడుతుంది.