ఫ్రిజ్ కాయిల్ ను క్లీన్ చేయడం చాలా అవసరం. దీనివల్ల ఫ్రిజ్ పనితీరు మెరుగుపడుతుంది. కాయిల్ కు దుమ్ము, ధూళి పేరుకుపోతే ఫ్రిజ్ సరిగ్గా పనిచేయదు.
వాటర్ ఫిల్టర్ ఉన్న ఫ్రిజ్ లల్లో దాన్ని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి.అప్పుడే ఫ్రిజ్ బాగా పనిచేస్తుంది.
ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేయనప్పుడు అందులో ఐస్ పేరుకుపోయి సరిగ్గా పనిచేయదు. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది.
చాలా మంది ఫ్రిజ్ ను గోడకు ఆనించి పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ కు సరైన గాలి ప్రసరణ అవసరం. ఇది లేకుంటే ఫ్రిజ్ తొందరగా వేడెక్కుతుంది.
ఫ్రిజ్ వాడేటప్పుడు అది సరైన ఉష్ణోగ్రతలో పనిచేసేలా చూసుకోవాలి. అంటే కూలిగ్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండకూడదు.
ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ గాస్కెట్‌నే సీల్ అంటారు. ఇది పాడైతే ఫ్రిజ్ సరిగ్గా పనిచేయదు.
ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఫ్రిజ్ లోని అన్ని భాగాలను శుభ్రం చేస్తే మీ ఫ్రిజ్ చాలా కాలం పాటు పనిచేస్తుంది.
టేస్టీగా ఉన్నాయని ఇవి తింటే.. కిడ్నీలకే ఎసరు
చిలగడదుంప మంచిదే కానీ వీళ్లు తినకూడదు
ఇంట్లో క్రిములు ఉండకూడదంటే ఈ 7 పనులు ఖచ్చితంగా చేయండి
Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?