చలికాలంలో కొబ్బరి నూనె వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుస్తే షాక్ అవుతారు..
జుట్టుకు కొబ్బరి నూనెను పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరుగుతుంది. నల్లగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. నిజానికి కొబ్బరి నూనెను జుట్టుకే కాదు.. వంటల్లో కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

కొబ్బరి నూనెను జస్ట్ వెంట్రుకలకు పెట్టడానికే కాదు.. దీనితో వంటలు కూడా చేసుకుని తినొచ్చు. చాలా మంది వంటల్లో ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనెనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అది కూడా కేరళలో.. కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఊడిపోవడం ఆగుతుంది. జుట్టు తెల్లబడే ఛాన్స్ కూడా ఉండదు. జుట్టు కూడా షైనీ గా పెరుగుతుంది. కానీ చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనెను పెట్టడమే మర్చిపోయారు. నిజానికి కొబ్బరి నూనె జుట్టుకే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..
సంతృప్త కొవ్వులు
కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఇది 80 శాతం ఉంటుంది. ఇది ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది. దీన్ని చర్మానికి రాసుకోవడం వల్ల డ్రై నెస్ పోతుంది. స్కిన్ హెల్తీగా ఉంటుంది.
బరువు తగ్గడానికి..
కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి. శరీర మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి..
కొబ్బరి నూనెను ఉపయోగించడం రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే చైన్ ట్రైగ్లిజరైడ్స్ గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అందుకే మధుమేహులు తినే ఆహారాలను కొబ్బరి నూనెతో తయారుచేసుకోవడం మంచిది.
ఇన్ఫెక్షన్ లతో పోరాడుతుంది..
కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ మన శరీరంలోకి వెళ్లి మోనోలారిన్ గా మారి ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. ఇవి యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా నశిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవారికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ కొబ్బరి నూనె వల్ల కొలెస్ట్రాల్.. ప్రొజెస్టెరాన్, ప్రెగ్నెనోల్ గా మారుతుంది. అందుకే మీ వంటల్లో కొబ్బరి నూనెను ఉపయోగించండి.
కొబ్బరి నూనె వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దగ్గు తగులుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోకూడని నిపుణులు చెబుతున్నారు.